జగన్ ఏపీ మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ సుప్రీం కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కాగా..  ఈ ఘటనపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు. కోర్టు దిక్కరణకు పాల్పడిన వారు రాజ్యాంగ పదవుల్లో ఉండేందుకు అర్హత కోల్పోతారని ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు.

ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో ఎంపీ రఘురా మీడియాతో మాట్లాడారు. కోర్టు ధిక్కారణకు పాల్పడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పదవి కోల్పోయే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తప్పు జరిగిందని భావించి క్షమాపణలు చెబితే జగన్ కు ముఖ్యమంత్రి పదవి నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

న్యాయవ్యవస్థపై ప్రభుత్వమే దాడి చేయడం సరికాదని ఎంపీ రఘురామ అన్నారు. రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదన్నారు. న్యాయవ్యవస్థ పై దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంతగా న్యాయవాదులు ఉద్యమం చేపట్టే అవకాశాలున్నాయని.. న్యాయవ్యవస్థ పై దాడిని కోర్టు దిక్కరణగా పరిగణించాలని ఆయన అన్నారు. 

న్యాయవ్యవస్థకు జగన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని.. లేదంటే.. సీఎం పదవిని కోల్పోయే ప్రమాదం ఉందని  రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నారు. జగన్ సీఎం పదవి కోల్పోతే జగన్ తల్లి విజయమ్మ లేక ఆయన భార్య భారతి ముఖ్యమంత్రి కావొచ్చనని చెప్పారు. అలాగే సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సెక్షన్‌ 174 కింద నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.