రఘురామకు తెలంగాణ హైకోర్టు షాక్.. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను వెనక్కిచ్చిన రిజిస్ట్రీ

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ (ys jagan), వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (vijayasai reddy) బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన హైకోర్టు రిజిస్ట్రీ వెనక్కి ఇచ్చారు
 

ysrcp mp raghu rama raju petition not taken by telangana high court due to technical issues

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ (ys jagan), వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (vijayasai reddy) బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు (raghu rama krishnam raju) బుధవారం తెలంగాణ హైకోర్టులో (telangana high court) పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, సాంకేతిక కారణాలతో రఘురామ పిటిషన్లను హైకోర్టు రిజిస్ట్రీ వెనక్కి ఇచ్చారు.  

కాగా, గత నెల మధ్యలో అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఊరట కలిగింది. రఘరామ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు (bail)  పిటిషన్లను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  తెలంగాణ హైకోర్టును కోరారు.

ఈ రోజు రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. న్యాయం కోసం, ధర్మం కోసం చివరి వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. అక్రమాస్తుల కేసులో సీఎం జన్మోహన్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు. సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకావలసి ఉందని, కానీ ఏదో ఒక కారణంతో వారు రావడం లేదని ప్రజలు అనుకుంటున్నారని రఘురామ చెప్పారు.

ALso Read:జగన్ బెయిర్ రద్దుకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశా.. రఘురామ

ఇంకా ఎన్ని వాయిదాలు వేస్తారో చూడాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కులాలకు 10 శాతం EWS రిజర్వేషన్ల అమలుపై స్పందిస్తూ.. చంద్రబాబు హయాంలో అందులో నుంచి కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారని.. ఇది చాలా సముచితమని తెలిపారు. నవ్యాంధ్రలో 48-50శాతం వరకు బీసీలు, 16 శాతం ఎస్సీలు, 5.5 శాతం ఎస్టీలు ఉన్నారని.. అగ్ర కులాల్లో సగం మంది కాపులు, బలిజ తెలగ వారే రఘురామ ఉన్నారని వివరించారు. 

ఈ రీత్యా 10 శాతం కోటాలో కాపు, బలిజ, తెలగలకు 5 శాతం, మిగతా 5 శాతం రిజర్వేషన్లకు కమ్మ, రెడ్డి, ఇతర అగ్ర సామాజిక వర్గాలకు కల్పించాలని రఘురామ కృష్ణంరాజు ప్రతిపాదించారు. ఈ దిశగా ముఖ్యమంత్రికి ఎవరైనా సలహా ఇవ్వాలని కోరుతున్నానని తెలిపారు. కాగా, విశాఖలో ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios