వైసీపీ (ysrcp) ఎంపీ మార్గాని భరత్ (margani bharat) సంచలన కామెంట్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ (telugu film industry) హైదరాబాద్‌లోనే వుందని.. ఏపీలో కాదన్నారు. సినీ పరిశ్రమకు మాత్రం 70 శాతం ఆదాయం ఏపీ నుంచే వెళ్తోందని భరత్ అన్నారు. ఏపీలో సినిమా పరిశ్రమ పెట్టడానికి .. టాలీవుడ్ (tollywood) పెద్దలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.  

అసలే ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు (movie ticket price issue) , థియేటర్ల మూసివేత (theater close) వ్యవహారం గరంగరంగా వున్న సంగతి తెలిసిందే. హీరో నాని చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు గట్టిగా కౌంటరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ (ysrcp) ఎంపీ మార్గాని భరత్ (margani bharat) సంచలన కామెంట్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ (telugu film industry) హైదరాబాద్‌లోనే వుందని.. ఏపీలో కాదన్నారు. సినీ పరిశ్రమకు మాత్రం 70 శాతం ఆదాయం ఏపీ నుంచే వెళ్తోందని భరత్ అన్నారు. ఏపీలో సినిమా పరిశ్రమ పెట్టడానికి .. టాలీవుడ్ (tollywood) పెద్దలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

మరోవైపు ఏపీలో టికెట్ల తగ్గుదల చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకది పెద్ద నష్టమని చెప్పొచ్చు. గ్రామాల్లో, మండలాల్లో టికెట్ల రేట్లు యాభై రూపాయల లోపే ఉన్నాయి. లో క్లాస్‌ టికెట్లు కేవలం ఐదు రూపాయలే ఉండటం గమనార్హం. దీనికితోడు ప్రభుత్వం థియేటర్లపై కఠిన ఆంక్షలు పెట్టాయి. లైసెన్స్ లు, ఆహార శుభ్రత, పార్కింగ్‌ ప్లేస్‌, మెయింటనెన్స్ పేరుతో మరికొన్ని థియేటర్లని సీజ్ చేస్తుంది. తగ్గిన టికెట్ల ధరలతో తమకు గిట్టుబాటు కాకపోవడంతో చాలా థియేటర్లు మూత పడ్డాయి. అధికారికంగా, అనధికారికంగా ప్రస్తుతం ఏపీలో 50-70 థియేటర్లు క్లోజ్‌ అయినట్టు సమాచారం. 

Also Read:Nani:“వకీల్ సాబ్” టైంలోనే చేసి ఉంటే..నాని కామెంట్స్!

ఇకపోతే సినిమా టికెట్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ హీరో నాని చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉందన్నారు. ‘శ్యామ్‌సింగరాయ్‌’రిలీజ్ ముందు రోజు తన సినిమా టీమ్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న నాని.. ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలు తగ్గించింది. ఏది ఏమైనా ఆ నిర్ణయం సరైనది కాదు. 

టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ ఎక్కువగా ఉంది. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. అయితే నేను ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది’’ అని నాని వ్యాఖ్యానించారు. ఆ వాఖ్యలు సెన్సేషన్ అయ్యాయి. ఆ వాఖ్యల వేడిలో ఉండగానే మరోసారి నాని కామెంట్స్ చేసారు. నాని మళ్ళీ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి.

నానీ మాట్లాడుతూ...అస్సలు టాలీవుడ్ కి ఈ సమస్య మొదలయ్యింది “వకీల్ సాబ్” నుంచి. అప్పుడే కనుక టాలీవుడ్ నుంచి అందరూ రియాక్ట్ అయ్యి ఉంటే ఇప్పుడు ఈ సమస్య ఈపాటికే పరిష్కారం అయ్యిపోయి ఉండేది అని సమస్య అయితే నిజంగా ఉంది కదా? అప్పుడే అందరం ఒక థాటి మీదకు వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది అని ఈరోజు ఇన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉండేది కాదని నాని తెలిపాడు. దీనితో మళ్ళీ నాని చెప్పిన ఈ కీలక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.