హెడ్ కానిస్టేబుల్‌కు క్లాస్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే రజనీ (వీడియో)

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి,, ముఖ్యమంత్రి జగన్ కు చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించాడంటూ ఓ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ పై చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ విరుచుపడ్డారు. 

YSRCP MLA Vidadala Rajani serious on Excise head constable

అమరావతి: చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీ ఎక్సైజ్ సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా మ‌ద్యం అమ్ముతున్న వారిని చిల‌కలూరిపేట ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ రాంప్రసాద్ లంచం డిమాండ్ చేస్తున్న ఆడియోలు తన దృష్టికి రావడంపై ఆమె స్పందించారు. 

స్వయంగా ఎమ్మెల్యే ఎక్సైజ్ కార్యాల‌యాన్ని త‌నిఖీ చేశారు. అక్రమంగా మ‌ద్యం అమ్ముతున్నవారిని అరెస్టు చేసి, ప్రభుత్వ స్పూర్తి దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఎక్సైజ్ సిబ్బందిపై ఉందని... కానీ కంచే చేను మేసిన‌ట్లుగా ఎక్సైజ్ సిబ్బందే లంచాలు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడటం దారుణమని ఆమె సిబ్బందిపై మండిపడ్డారు. ఇది చాలా పెద్ద విష‌య‌మ‌ని, ఆ అవినీతి అధికారి ఎవ‌రా అని తెలుసుకుందామ‌నే కార‌ణంతోనే తాను కార్యాలయానికి రావాల్సి వచ్చిందని అన్నారు.

వీడియో

"

తాను ఇలాంటి అవినీతి విష‌యం గురించి అడ‌గ‌డానికి ఇలా ఈ కార్యాల‌యానికి మొద‌టిసారి కావడం త‌న‌కూ బాధ‌గానే ఉంద‌ని అన్నారు. ఇలాంటి అధికారుల‌కు అస‌లు ఈ రాష్ట్రంలోనే ఉండే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తమ ప్రభుత్వం ఎంతో నిజాయితీగా మ‌ద్యం అమ్మకాలను ద‌శ‌ల‌వారీగా త‌గ్గించుకుంటూ వ‌స్తోంద‌ని... కానీ కొంత‌మంది అధికారుల వ‌ల్ల త‌మ సీఎం వైఎస్ జగన్ ఆశయం దెబ్బతింటోందని ఆమె అన్నారు. అలాంటి వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అప్పటికప్పుడు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సదరు హెడ్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విడదల రజిని కోరారు.

వైసిపి  ప్రభుత్వం ఎంతో నిజాయితీగా మ‌ద్యం అమ్మకాలను ద‌శ‌ల‌వారీగా త‌గ్గించుకుంటూ వ‌స్తోంద‌ని... కానీ కొంత‌మంది అధికారుల వ‌ల్ల సీఎం వైఎస్ జగన్ ఆశయం దెబ్బతింటోందని ఎమ్మెల్యే రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios