చంద్రబాబు అమరావతి ఉద్యమం అంటున్నారు. అది అసలు రాయలసీమ వ్యతిరేక ఉద్యమమని రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.అమరావతి ఉద్యమం తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ఉద్యమంగా ఆయన పేర్కొన్నారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర వ్యతిరేక ఉద్యమం. అది అమరావతి డెవలప్‌మెంట్‌కు కూడా వ్యతిరేక ఉద్యమం అని గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 

ఒక రాయలసీమవాసిగా ఆ ప్రాంతంలో హైకోర్టు ఉండకూడదా అని ఆయన ప్రశ్నించారు. కన్నభూమి.. కన్నతల్లి ఒక్కటే అంటాం. అలాంటి రాయలసీమకు ఏమీ వద్దని చంద్రబాబు మాట్లాడుతున్నారు. అంటే.. ఇక్కడ జరుగుతున్నది యాంటీ రాయలసీమ ఉద్యమం.. యాంటీ ఉత్తరాంధ్ర ఉద్యమం, యాంటీ అమరావతి ఉద్యమం అని గడికోట శ్రీకాంత్ అన్నారు. 

 వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఏమీ ఉండకూడదు. ఏవీ పెట్టకూడదని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. హైటెక్ అనే చంద్రబాబు తన ఆలోచనల్లో ఇంకా డెమోగ్రఫిక్‌ ఇన్‌ బ్యాలెన్స్‌ అనటం ఏంటి? ఇది దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు.

 అధికారంలేనప్పుడు చంద్రబాబుకు అమరజీవి పొట్టి శ్రీరాములు, అంబేద్కర్‌, ఇతర కులాలు గుర్తుకు వస్తాయ్‌. వాటిపైన మాట్లాడుతారు. అధికారంలో ఉంటే కొందరు బినామీలు మాత్రమే చంద్రబాబు గుర్తించుకొన్నారని ఆయన విమర్శించారు.. ఓట్ల కోసం అంబేద్కర్ గారికి 125 అడుగుల విగ్రహం కడతానన్న చంద్రబాబు ఐదేళ్లలో ఏమాత్రం ముందుకు పోనివ్వలేదన్నారు.

 టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గిరి  చంద్రబాబుకు ఉన్న కులపిచ్చి భరించలేక అసహ్యించుకొని పార్టీ మారుతున్నానని బయటకు వచ్చారో  లేదో టీడీపీ వారు చెప్పండని గడికోట ప్రశ్నించారు. వెల్లంపల్లి శ్రీనివాస్  నుంచి కోరుగట్ల వీరభద్రస్వామి వరకు ఎంతోమందికి భద్రత ఇస్తూ ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటున్న ప్రభుత్వం ఇది. వైశ్యులపై కేవలం బాబుకే ప్రేమ ఉన్నట్లు మాట్లాడటం ఏంటన్నారు. 

 ఇవాళ రైతులు సంతోషంగా ఉన్నారనే దుర్మార్గపు ఆలోచనతో చంద్రబాబు డైవర్షన్‌ ఆలోచనలతో మీడియా సమావేశం పెట్టి నాలుగు అసభ్యమైన మాటలు, అసత్యాలు మాట్లాడారన్నారు. 

దేశ రాజధానిలో కట్టబోయే పార్లమెంట్‌ అమరావతి ఆలోచనతో కాపీ కొట్టి చేస్తున్నారని చంద్రబాబు మాట్లాడటం ఏంటి? చంద్రబాబును ఏమనాలో అర్థం కావటం లేదన్నారు.. అసలు అమరావతిలో కట్టింది ఏమీ లేదన్నారు. టెంపరరీ కేపిటల్ అని అడుగుకు రూ.12,000 దోచేశారని ఆయన ఆరోపించారు.


చంద్రబాబుకు ధైర్యముంటే మోడీకి లేఖ రాయాలి. తన డిజైన్లను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని లేఖ రాసే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని గడికోట ప్రశ్నించారు. ఎక్కడ చూసినా ఏది జరిగినా నన్ను కాపీ కొట్టారని చంద్రబాబు మాట్లాడుతుంటారు. 

 అమరావతి రైతుల నుంచి బలవంతంగా 32వేల ఎకరాల భూములు లాక్కొన్నారు. ఇవ్వను అన్న వారి అరటి తోటలు తగలబెట్టించారు. అక్కడ కూడా రాయలసీమ ఆత్మాభిమానం దెబ్బతినేలా రాయలసీమ గూండాలు కాల్చారని చంద్రబాబు అన్నారు. 

also read:అమరావతికి మద్దతుగా విజయవాడలో జేఏసీ పాదయాత్ర

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఒకటే రాజధాని ఉండాలని అంటున్నారు.బీజేపీ వాళ్లు వారి మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు పెడతామన్నారో లేదో ఒకసారి చూసుకోమని సోమువీర్రాజును కోరుతున్నామన్నారు.  స్వయంగా బీజేపీ వాళ్లే అమరావతిలో స్కాం జరిగిందని మాట్లాడారా? లేదా అని గడికోట ప్రశ్నించారు. బీజేపీ వారు డీసెంట్రలైజ్‌ కోసం మద్దతు ఇచ్చారా? లేదా?  అని ఆయన అడిగారు.

కేంద్ర ప్రభుత్వమూ రాజధాని అంశం అనేది రాష్ట్ర పరిధిలోనిది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరైందని అన్నారో లేదో సోమువీర్రాజు ఒక స్పష్టత ఇస్తే బావుంటుందని గడికోట శ్రీకాంత్ రెడ్డి కోరారు.