అమరావతి: మూడు రాజధానులు వద్దు.. అమరావతిలోనే రాజధాని ఉండాలనే డిమాండ్ తో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో  విజయవాడలో మంగళవారం నాడు పాదయాత్ర నిర్వహించారు.

టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్రతో విజయవాడలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు.

శనివారం నుండి ఈ నెల 17వ తేదీ వరకు పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 17న ఉద్దండరాయుని పాలెంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టుగా జేఏసీ నేతలు ప్రకటించారు.


శనివారం నుండి ఈ నెల 17వ తేదీ వరకు పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 17న ఉద్దండరాయుని పాలెంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టుగా జేఏసీ  నేతలు ప్రకటించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రకటించాలని, ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. గుంటూరు, విజయవాడలో నిర్వహించిన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రాష్ట్రం నలు మూలల నుండి ప్రజలు పాల్గొన్నారని వారు చెప్పారు.

మాజీ శాసన సభ్యులు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతం అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. అయితే రాజధాని అభివృద్ధితో పాటు పలు కంపెనీలు కూడా ఇక్కడకు వచ్చాయన్నారు. అధికారంలోకి వచ్చిన జగన్మోహనరెడ్డి మాత్రం మూడు రాజధానులు ప్రకటించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. 

అమరావతి రైతు ఐకాసా కన్వీనర్ పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రాజధానికోసం 34వేల మంది రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారన్నారు. కాని ప్రస్తుత ముఖ్యమంత్రి రాజధాని అభివృద్ధి చేయకపోగా మూడు రాజధానులు అని ప్రకటించారన్నారు. 

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజారాజధానిగా అమరావతి ప్రకటించే వరకు ఉ ద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అహంకారంతో మూడు రాజధానుల విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారని నాటి నుండి సంవత్సర కాలం పాటు ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతూనే ఉందన్నారు. 

తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమం చరిత్రలో ఎక్కడా జరగలేదన్నారు. రాజధాని కోసం 34వేల మంది రైతులు భూములు ఇచ్చి త్యాగం చేశారని కాని ప్రస్తుతం ముఖ్యమంత్రి రైతుల త్యాగాలను గుర్తించకుండా మూడు రాజధానులు ఉంటాయని ప్రకటించడం సరైనది కాదన్నారు.