ప్రత్యర్ధుల విమర్శలకు తనదైన శైలిలో సమాధానం చెప్పగల వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా ఏం చేసినా సెన్సేషనే. తాజాగా ఆమె డ్రైవర్ అవతారం ఎత్తారు.

వివరాల్లోకి వెళితే.. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు జీటీవీ యాజమాన్యం 10 అంబులెన్స్‌లను అందజేసింది. ఈ అంబులెన్స్‌లను మంత్రి పేర్ని నాని, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా మంగళవారం మంగళగిరిలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె స్టీరింగ్ పట్టుకుని అంబులెన్స్‌ను నడిపారు. దీంతో మీడియా కెమెరాలన్నీ రోజా వెంట పరిగెత్తాయి. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు వైద్యం అందిస్తున్నారని ప్రశంసించారు.

కరోనా నియంత్రణలో సీఎం జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. పేర్ని నాని మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ప్రయత్నానికి సహాయపడుతూ అంబులెన్స్‌లు అందించడం సంతోకరం అన్నారు. కరోనా కట్టడికి సీఎం జగన్‌ అన్ని రకాల చర్యలు తీసుకుంటుటున్నారని తెలిపారు.