Asianet News TeluguAsianet News Telugu

అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. నా సెల్ నుంచి ‘కాల్ రికార్డింగ్’షేర్ అయ్యింది : కోటంరెడ్డి మిత్రుడు రామశివారెడ్డి

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మిత్రుడు రామశివారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన వెనుక ఎవరూ లేరని, రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడటం ఇష్టం లేకనే స్వచ్ఛందంగా వచ్చి నిజం చెబుతున్నానని రామశివారెడ్డి చెప్పారు. 

ysrcp mla kotamreddy sridhar reddy friend gave clarity on phone tapping issue
Author
First Published Feb 8, 2023, 3:34 PM IST

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతోన్న సంగతి తెలిసిందే. చివరికి కోటంరెడ్డి పార్టీ మారే పరిస్ధితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన మిత్రుడు రామశివారెడ్డి స్పందించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అవ్వలేదని.. తన ఫోన్‌లో రికార్డయిన కాల్ కాంట్రాక్టర్‌కు షేర్ అయ్యిందని చెప్పారు. నెల్లూరు జిల్లా కాంట్రాక్టర్‌కు సంబంధించి తామిద్దరం అందులో డిస్కస్ చేసినట్లు రామశివారెడ్డి వెల్లడించారు. తన ఫోన్‌లో ఆటోమేటిగ్గా ఫోన్ కాల్ రికార్డ్ అవుతుందని.. కావాలంటే కేంద్ర హోంశాఖ, సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. తన వెనుక ఎవరూ లేరని, రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడటం ఇష్టం లేకనే స్వచ్ఛందంగా వచ్చి నిజం చెబుతున్నానని రామశివారెడ్డి చెప్పారు. 

ALso REad: ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు అమిత్ షాకు లేఖ: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఇదిలావుండగా.. తన ఫోన్ ట్యాపింగ్  కు సంబంధించి  విచారణ జరపాలని కేంద్ర హోంశాఖకు  లేఖ రాసినట్టుగా  నెల్లూరు రూరల్  ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  చెప్పారు. బుధవారం నాడు శ్రీధర్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై  కేంద్ర  హోంశాఖ అమిత్ షా కు  రాసిన లేఖను  మీడియాకు  చూపారు. తన  ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెబితే తనపై  వైసీపీ నేతలు ఆరోపణలు  చేస్తున్నారని మండిపడ్డారు. తనను  తిట్టడమే  పనిగా  వైసీపీ  నేతలు పెట్టుకున్నారని  ఆయన  విమర్శించారు. 

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో  వైసీపీ నెల్లూరు రూరల్  ఇంచార్జీ పదవి నుండి  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తప్పించింది  ఆ పార్టీ. మాజీ మంత్రి, ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డిని ఇంచార్జీగా  నియమించింది. దీంతో అదాల ప్రభాకర్ రెడ్డి  నెల్లూరు రూరల్  నియోజకవర్గ  వైసీపీ ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి  వైసీపీ అభ్యర్ధిగా  అదాల ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది.  


 

Follow Us:
Download App:
  • android
  • ios