ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు అమిత్ షాకు లేఖ: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి విచారణ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాశారు.
నెల్లూరు: తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి విచారణ జరపాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్టుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. బుధవారం నాడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై కేంద్ర హోంశాఖ అమిత్ షా కు రాసిన లేఖను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాకు చూపారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెబితే తనపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనను తిట్టడమే పనిగా వైసీపీ నేతలు పెట్టుకున్నారని ఆయన విమ ర్శించారు.
తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల కాలంలో ఆరోపించారు. తన ఆరోపణలకు సంబంధించి ఆధారాలున్నాయని కూడా చెప్పారు.ఈ ఆధారాలను బయటపెడితే ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు పోతాయన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కు, పోన్ రికార్డింగ్ తేడా తెలియకుండా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. టీడీపీలో చేరడానికి నిర్ణయించుకొని తమపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
మంత్రి పదవి దక్కకపోవడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీంతో అధికారులపై బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ విషయమై సీఎం జగన్ పిలిపించుకొని కూడా మాట్లాడారు. కానీ ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. వైసీపీలో ఉంటే తనకు మంత్రి పదవి దక్కదనే కారణంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారని జగన్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
also read:పెళ్లి చేసుకుంటానని, తాళి కట్టే సమయానికి పారిపోలేదు.. ఆదాలకు కోటంరెడ్డి పంచ్....
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నెల్లూరు రూరల్ ఇంచార్జీ పదవి నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తప్పించింది ఆ పార్టీ. మాజీ మంత్రి అదాల ప్రభాకర్ రెడ్డిని ఇంచార్జీగా నియమించింది. అదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్ధిగా అదాల ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది.