టీటీడీ ఆస్తుల అమ్మకం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై చెవిరెడ్డి  భాస్కర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని టీటీడీ ఆస్తుల నిర్వహణ చాలా కష్టంగా మారిందని తెలిపారు.

కొన్ని చోట్ల రూపాయి లీజుకు భూములు ఇచ్చేస్తున్నామని ఆయన చెప్పారు. టీటీడీకి చెందిన 400 వందల కల్యాణ మండపాలు ఎవరైనా కోరితే నిర్వహిస్తామంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెవిరెడ్డి తెలిపారు.

Also Read:శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన జగన్ సర్కార్, ప్రతిపక్షాల విమర్శలు

కొన్ని కల్యాణ మండపాల్లో కనీసం ఏడాదికి ఒక్క పెళ్లి కూడా జరగడం లేదు. కానీ ఆయా కళ్యాణ మండపాల నిర్వహణకు అయ్యే ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటోందని చెవిరెడ్డి స్పష్టం చేశారు.

ఇలా నిర్వహణ కోసం ఖర్చు పెట్టుకుంటూ పోతే టీటీడీ ఆస్తులన్నీ కరిగిపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో, పాలక మండలిలో దేవుడి మీద భక్తి కంటే భయం ఉన్న వారే ఎక్కువగా ఉన్నారని స్పష్టం చేశారు.

Also Read:పెరిగిన ఆన్‌లైన్ ఆదాయం: రూ. 25లకే జిల్లాల్లో తిరుపతి లడ్డుల విక్రయం

భగవంతుడి విషయంలో రాజకీయాలు చేయమని చెవిరెడ్డి తేల్చి చెప్పారు. తమిళనాడులోని శ్రీవారి ఆలయానికి చెందిన 23 స్థిరాస్తులను వేలం ద్వారా విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రెండు కమిటీలు వేసింది. ఈ ఆస్తుల ద్వారా తిరుమల ఆలయానికి ఒరిగేదేం లేదని.. వాటి నిర్వహణ భారంగా మారిందని టీటీడీ బోర్డు వాదిస్తోంది. అందుకోసమే వేలం వేసి విక్రయించాలని తీర్మానించినట్లు పేర్కొంది.