Asianet News TeluguAsianet News Telugu

శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన జగన్ సర్కార్, ప్రతిపక్షాల విమర్శలు

తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించిన భూములను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాజకీయ దుమారం మొదలయింది. టీటీడీకి సంబంధించి చెన్నైలో 25 చోట్ల ఉన్న శ్రీవారి భూములను అమ్మేయాలని టీటీడీ బోర్డు నిశ్చయించుకుంది. 

TTD assets For Sale in Andhra Pradesh, Opposition Slams CM YS Jagan
Author
Tirumala, First Published May 23, 2020, 6:39 PM IST

కరోనా వైరస్ మహమ్మారిపై, భారత దేశ ఆర్ధిక వ్యవస్థపై దేశమంతా చర్చ నడుస్తున్నప్పటికీ... ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజకీయాలు అంతకన్నా హాట్ గానే ఉంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల పైనుంచి మొదలు డాక్టర్ సుధాకర్ అంశం వరకు అనేక రాజకీయ హై వోల్టేజి విషయాలకు తోడుగా ఇప్పుడు శ్రీవారి భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడానికి తీసుకున్న నిర్ణయం నూతన రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. 

తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించిన భూములను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాజకీయ దుమారం మొదలయింది. టీటీడీకి సంబంధించి చెన్నైలో 25 చోట్ల ఉన్న శ్రీవారి భూములను అమ్మేయాలని టీటీడీ బోర్డు నిశ్చయించుకుంది. 

ఈ భూములన్నీ వివిధ సందర్భాల్లో భక్తులు శ్రీవారికి సమర్పించిన భూములు. వ్యవసాయ భూముల నుంచి ఇండ్ల స్థలాల వరకు అనేక భూములు భక్తులు స్వామివారికి సమర్పించుకున్నారు. ఆ భూముల నిర్వహణ ఇప్పుడు భారం,అవుతుందన్న కారణంతో వాటిని అమ్మకానికి పెట్టింది ఏపీ సర్కార్. ప్రపంచంలోనే ధనిక దేవాలయానికి ఆస్తుల నిర్వహణ భారంగా మారిందా అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. 

అసలే ప్రభుత్వ భూముల అమ్మకమే ఆంధ్రప్రదేశ్ లో వివాదాస్పదంగా మారుతున్న వేళ.... ఏకంగా శ్రీవారి భూములను అమ్మకానికి పెట్టడంతో విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.  లాక్ డౌన్ కాలంలోనే ఇందుకు సంబంధించిన పనులు పూర్తయిపోయినట్టు కొన్ని వర్గాల సమాచారం. ఇప్పుడు అందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. 

బీజేపీ ఎంపీ, మాజీ టీడీపీ నేత టీజీ వెంకటేష్ ఈ విషయంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ భూములను వేలం వేయడానికి వీలు లేదని, కోర్టుల నుంచి ఆదేశాలు ఉన్నాయని వెంకటేష్ అన్నారు. 

అది గనుక జరిగితే న్యాయస్థానంలో కేసు వేయొచ్చని ఆయన అన్నారు. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, అవి చేస్తూ పోతే మంచిదని టీజీ వెంకటేష్ జగన్ సర్కార్ కు హితవు పలికారు. 

Follow Us:
Download App:
  • android
  • ios