మంత్రి వర్గ విస్తరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. తాను మంత్రి, స్పీకర్ పదవి రేసులో లేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఊహల్లో వుంటూ రాజకీయాలు చేయనని ఆనం తేల్చిచెప్పారు.
ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆశావహులు పలుమార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు.. తాము పార్టీకి చేసిన సేవ గురించి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (anam ramanarayana reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ స్పీకర్, మంత్రి పదవి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. తనకు పదవి వస్తుందా..? రాదా.? అనేది ఊహాజనితమని ఆనం పేర్కొన్నారు. ఊహల్లో వుంటూ తాను రాజకీయాలు చేయనని రామనారాయణ రెడ్డి వెల్లడించారు. మంత్రి పదవులు ఎవరికి అనేది సీఎం వద్ద నుంచి గవర్నర్‌కు లిస్ట్ వెళ్లి, ఫోన్లు వచ్చే దాకా ఎవరికీ తెలియదని ఆనం తెలిపారు.
కాగా. ఇటీవల New District ఏర్పాటు విషయమై ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు , బాలాజీ జిల్లాల మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, కలువాయి, రాపూరు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా విభజనలో Venkatagiriకి అన్యాయం జరిగిందన్నారు. డిలిమిటేషన్, రాష్ట్ర విభజన సమయాల్లో ప్రజలు నష్టపోయారన్నారు.
మళ్లీ నష్టపోవడానికి సిద్ధంగా ప్రజలు సిద్దంగా లేరన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్‌పై రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య జరుగుతున్న దాడుల మాదిరిగా Nellore-Balaji జిల్లాల పోలీసులకు సమస్యలు వచ్చే అవకాశముందన్నారు. శాస్త్రబద్ధంగా నీళ్లు, నిధుల గురించి చట్టపరంగా ఆలోచించి జిల్లాల విభజన చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి అశాస్త్రీయ విధానం బాధ కలిగిస్తోందని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
ఈ క్రమంలో ఆనం వ్యాఖ్యలపై వైసీపీ నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి (nedurumalli ramkumar reddy ) కౌంటరిచ్చారు. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి లేకుంటే ఆనంకు రాజకీయ భవిష్యత్ లేదంటూ దుయ్యబట్టారు. బాలాజీ జిల్లాకి వెంకటగిరి ప్రజలు వ్యతిరేకంగా లేరని.. ఎమ్మెల్యేగా రాపూర్‌కి ఆనం ఏం చేశారో చెప్పాలని రాంకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆనం ఫ్యామిలీని తొక్కాలనుకుంటే.. జనార్థన్ రెడ్డి ఎప్పుడో పక్కన పెట్టేవారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
