అప్పుడు చంద్రబాబు ఎన్నో బస్సుల్ని తగులబెట్టించారు : అంబటి సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబు (chandrababu naidu) ఎన్ని బస్సులు తగులబెట్టించారు అంటూ రాంబాబు ఆరోపించారు. మీ కొంగ జపాలను ప్రజలు నమ్మారంటూ ఆయన దుయ్యబట్టారు. మీ పార్టీ నేతల వ్యాఖ్యల్ని ఖండించకపోగా.. వారికే వంత పాడుతారా అంటూ అంబటి ఫైరయ్యారు. 

ysrcp mla ambati rambabu sensational comments on tdp chief chandrababu naidu

టీడీపీ (tdp offices) కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల (ysrcp attacks) దాడిపై స్పందించారు ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు (ambati rambabu). బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీని (ap dgp) , సీఎంని (ap cm ys jagan) తిడతారంటూ మండిపడ్డారు. ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ పోటీ చేయలేని పరిస్ధితికి వచ్చిందంటూ అంబటి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబు (chandrababu naidu) ఎన్ని బస్సులు తగులబెట్టించారు అంటూ రాంబాబు ఆరోపించారు. మీ కొంగ జపాలను ప్రజలు నమ్మారంటూ ఆయన దుయ్యబట్టారు. మీ పార్టీ నేతల వ్యాఖ్యల్ని ఖండించకపోగా.. వారికే వంత పాడుతారా అంటూ అంబటి ఫైరయ్యారు. 

కాగా, తమ పార్టీ కార్యాలయాలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) కార్యకర్తల అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) బుధవారం బంద్ నిర్వహిస్తోంది. టీడీపీ కార్యకర్తలు బుధవారం ఉదయం నుంచే రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలకు దిగారు. దీంతో తెలుగు తమ్ముళ్లను, నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయినప్పటికీ పసుపు శ్రేణులు నిరసన తెలుపుతూనే వున్నాయి. 

ALso Read:మేమేం గాజులు తొడుక్కోలేదు... తోలు ఒలిచేస్తాం జాగ్రత్త: టిడిపి నాయకులకు మంత్రి అనిల్ వార్నింగ్

ఈ క్రమంలో నిన్న(మంగళవారం) టిడిపి, వైసిపిల మధ్య భౌతిక యుద్దం జరగ్గా నేడు మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా బుధవారం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టిడిపి నాయకులకు గట్టిగా హెచ్చరించడంతో పాటు సవాల్ కూడా విసిరారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి ys jaganmohan reddy ని పట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడితే తోలు తీస్తామంటూ టిడిపి నేతలకు మంత్రి anil kumar yadav తనదైన శైలిలో హెచ్చరిక జారీ చేశారు. ysrcp అధ్యక్షులు జగన్ ను అనడం కాదు ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్తమీద చెయ్యి వేసి చూడండి... తోలు వలిచేస్తాం అని హెచ్చరించారు. 

''ఒక ముఖ్యమంత్రిపైన ఇష్టారాజ్యంగా మాట్లాడతారా? టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు ముఖ్యమంత్రిని తిడుతూ.. తిరిగి మమ్మల్నే బూతులు మంత్రులు అని ప్రచారం చేస్తున్నారు. తమ సహనానికి కూడా ఒక స్థాయి ఉంటుంది'' అని మంత్రి అనిల్ పేర్కొన్నారు. ఇక టీడీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని మమ్మల్ని సీఎం జగన్ ఆదేశించారని ఏపీ ప్రభుత్వ చీప్ విప్  శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అయితే టీడీపీ నేతలు ప్రియతమ నాయకుడు Ys jagan ను తిడుతుంటే వైసీపీ కార్యకర్తలు భరించలేకపోయారని... అందుకే టిడిపిపై తిరగబడ్డారని ఆయన వివరించారు. జగన్ ను ప్రేమించే వ్యక్తులు టీడీపీ నేతల మాటల్ని ఎన్నాళ్లు భరిస్తారని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios