వైసీపీ అంతా త్వ‌ర‌లో ఖాళీ

YSRCP leaders try to shift TDP says kollu
Highlights

  • వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుంది. 
  • టీడీపీల ోకి రావడానికి చాలా మంది వైసీపీ నేతలు సంప్రదిస్తున్నారు.
  • 2019 లో టీడీపీనే గెలుస్తుంది. 

త్వ‌ర‌లో వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుంద‌ని మంత్రి కొల్లు ర‌వీంద్రం జోస్యం చెప్పారు. నంద్యాల, కాకినాడ ఎన్నిక‌ల త‌రువాత వైసీపీ నేత‌లకు త‌మ‌ పార్టీ పై న‌మ్మ‌కం పోయింద‌ని ఎద్దేవా చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు త్వరలోనే ఆపార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని.. వారంతా ముఖ్యమంత్రి నిర్ణయం కోసం వేచిచూస్తున్నారన్నారు. నంద్యాల‌, కాకినాడ విజ‌యాల సంద‌ర్భంగా టీడీపీ ఏలూర్ లోని ఆర్ఆర్ పేటలో విజ‌యోత్స‌వ స‌భ నిర్వ‌హించారు. అందులో మంత్రి కొల్లు ర‌వీంద్ర‌తో పాటు ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు.  

 రాష్ట్రంలో రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు అనేక ప్రాజెక్టులను చేపడుతుంటే ప్రతిపక్ష నాయకుడు ఓర్వలేక అడుగడుగునా అడ్డు పడుతున్నారని మంత్రి ఆరోపించారు. రెండు ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడినా ప్ర‌తిప‌క్ష నేత వైక‌రీ మారలేద‌ని విమ‌ర్శించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించేందుకు ఈనెల 7న ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వస్తున్నట్లు తెలిపారు.

అనంత‌రం ఎంపీ మాగంటి బాబు మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు తెదేపా కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయన్నారు. త్వరలోనే వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. ఎన్నికల ముందు ఒకమాట.. తరువాత మరోమాట చెపితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే ఘన విజయం సాధిస్తుందన్నారు.

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి  

 

loader