అమరావతి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మంత్రి మోపిదేవి వెంకటరమణ, చల్లా రామక్రిష్ణారెడ్డి, ఇక్బాల్‌లు బుధవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

శాసన మండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, చల్లా రామక్రిష్ణారెడ్డిలు భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేయగా, ఇక్బాల్‌ ఖురాన్‌ మీద ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు. 

ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలకు శాసన మండలి చైర్మన్ ఎం.ఏ షరీఫ్ అభినందనలు తెలిపారు.