న్యూఢిల్లీ: ఏపీలో కౌంటింగ్, రీపోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చెయ్యాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కౌంటింగ్ జరిగే అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. 

అలాగే రీ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రత మరింత పెంచాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. 

చంద్రగిరి నియోజకవర్గంలో నేటికి దళితులు ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని టీడీపీ వారిని అడ్డుకుంటుందన్నారు. దళితులు ఓటు హక్కు వినియోగించకుండా కలెక్టర్ ప్రద్యుమ్న వ్యవహరిస్తున్నారని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.