అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి  యామిని శర్మపై వైసీపీ మహిళా విభాగం నేతలు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కించపరుస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏపీ సీఎం జగన్‌ను కించపరుస్తూ యామిని శర్మ ఫేస్‌బుక్ పోస్టులు పెట్టారని  వైసీపీ మహిళా విభాగం నేత ఝాన్సీ ఆరోపించారు.  యామిని శర్మపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఈ మేరకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఇదిలా ఉంటే తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను సృష్టించి కొందరు ప్రముఖులను  లక్ష్యంగా చేసుకొని  అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని టీడీపీ నేత యామిని ఇర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే వైసీపీ నేతలు యామిని శర్మపై ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

ఫేస్‌బుక్‌లో అసభ్య రాతలు: పోలీసులకు టీడీపీ నేత యామిని శర్మ ఫిర్యాదు