అమరావతి: టీటీడీ నూతన చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమవుతోంది. పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో ఇక ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారు. 

శనివారం వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. శనివారం ముహూర్తం బాగుండటంతో ఆరోజే టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాలని నిర్ణయంచుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ రెండు రోజుల్లో టీటీడీ పాలక మండలి సభ్యులపై కూడా సీఎం వైయస్ జగన్ దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. వైవీసుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించే సమయానికి 8 మంది పాలక మండలి సభ్యుల నియామకాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

దిగొచ్చిన పుట్టా సుధాకర్ యాదవ్: టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా