చంద్రబాబుకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సరిగా వినియోగించుకోలేదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు తన విజన్‌ను 2020 నుంచి 2050కి మార్చుకున్నారని ఆరోపించారు.

చంద్రబాబు వయసును దృష్టిలో పెట్టుకుని విజన్ గురించి ఆలోచించాలని సజ్జల చురకలంటించారు. చంద్రబాబుది నకిలీ దార్శనికత అని రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు.

నిజమైన విజనరీ తన చేతల్లో, తాను బతికే విధానంలో, తను వ్యవహరించే తీరులో చూపిస్తారని వైఎస్, జగన్‌లు తెలిపారని సజ్జల చెప్పారు.

తనను తాను ప్రొజెక్ట్ చేయడంతో పాటు భ్రమలను కెమెరాల ద్వారా చూపించారని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు.