పక్కవాళ్ల మీద పడి ఏడవటం చంద్రబాబుకు అలవాటేనన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు అదే తీరులో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఓటమిని కూడా సిగ్గు లేకుండా గెలుపులా చెప్పుకుంటున్నారని సజ్జల దుయ్యబట్టారు. ఇప్పుడేమో ఎస్ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని.. గెలిస్తే ఎక్కడ గెలిచారో నిరూపించాలని రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు.
రెండు రోజుల ముందు కూడా సజ్జల ఇదే రకమైన కామెంట్స్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని చంద్రబాబు హుందాగా అంగీకరించాలని సూచించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల్లో 81 శాతానికిపైగా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారని తెలిపారు. ఓటమిని కూడా కొందురు వేడుక చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేతలను ఉద్దేశించి అన్నారు.
చంద్రబాబు ఇప్పటికైనా ఓటమిని అంగీకరిస్తే బాగుంటుందన్నారు. పార్టీ మద్దతుతో విజయం సాధించిన అభ్యర్థుల ఫొటోలను సాయంత్రానికి వెబ్‌సైట్‌లో ఉంచుతాం. ఫలితాల్లో తప్పులున్నట్లు చూపితే సరిచేసుకుంటామని సూచించారు. అమరావతి ప్రాంతంలోనూ వైసీపీకి మంచి ఫలితాలు వచ్చాయని వెల్లడించారు.