చంద్రబాబు (chandrababu naidu) అజెండానే బీజేపీ (bjp) అజెండా అన్నారు వైసీపీ (ysrcp) నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) . చంద్రబాబు అజెండా పట్టుకొనే బీజేపీ సభ పెట్టిందని ఆరోపించారు. టీడీపీ అనుబంధ విభాగంలా బీజేపీ పనిచేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీకి అనుబంధంగా జాతీయ పార్టీ వుండటం చరిత్రలో ఇదే తొలిసారి అని సజ్జల అన్నారు. 

చంద్రబాబు (chandrababu naidu) అజెండానే బీజేపీ (bjp) అజెండా అన్నారు వైసీపీ (ysrcp) నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) . బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అజెండా పట్టుకొనే బీజేపీ సభ పెట్టిందని ఆరోపించారు. టీడీపీ అనుబంధ విభాగంలా బీజేపీ పనిచేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీకి అనుబంధంగా జాతీయ పార్టీ వుండటం చరిత్రలో ఇదే తొలిసారి అని సజ్జల అన్నారు. 

బీజేపీని చూస్తే పాపమనిపిస్తోందని.. మాటలు సోము వీర్రాజువే అయినా స్క్రిప్ట్ మాత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వస్తోందని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటి నుంచే పొత్తు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్ (ys jagan mohan reddy) టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు. ఆధారాలు లేని ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ సీఎం అవుతానన్న భ్రమలో చంద్రబాబు వున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తోందని సజ్జల అన్నారు. తన పార్టీ ఎంపీలు బీజేపీలో చేరితే టీడీపీ ఎందుకు ప్రశ్నించదని ఆయన నిలదీశారు. 

ALso Read:ఏపీలో బీజేపీ ఉనికే లేదు.. విప‌క్షాల‌పై స‌జ్జ‌ల ఫైర్

చంద్రబాబే, సుజనా చౌదరి ని బీజేపీలోకి పంపించారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇంతటి వ్యభిచారం లాంటి రాజకీయం ఎక్కడా చూడలేదని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఒక్కటేనని.. సునీల్ దేవధర్ ట్వీట్లు అన్ని పచ్చి అబ్బద్దాలేనని సజ్జల మండిపడ్డారు. 135 లక్షల కోట్లు అప్పుల చేసిన బీజేపీ నేతలు ఇక్కడ కి వచ్చి తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలకు కేంద్రం పేరు పెడుతున్నామని.. ఎరుపు, పసుపు కలిసి కాషాయం అవుతుందని అభివర్ణించారు. మద్యంపై సోము వీర్రాజు చేసిన కామెంట్లు బీజేపీ జాతీయ విధానమా అని సజ్జల ప్రశ్నించారు. అటు వంగవీటి రాధ తనపై రెక్కీ నిర్వహిస్తున్నారు అని చేసిన వ్యాఖ్యలు సీఎం దృష్టికి రాగానే భద్రత కల్పించాలి అని చెప్పారని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్లు తిరస్కరించడం ఆయన ఇష్టమన్నారు.