విజయవాడ:విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు విజయవాడ పశ్చిమ అసెంబ్లీ  స్థానం కారణంగా  పలువురు టీడీపీ  నేతలు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో తాను సూచించిన  అభ్యర్ధికి టిక్కెట్టు కేటాయిస్తే  పరిస్థితి మరోలా ఉండేదని కేశినేని నాని అభిప్రాయంగా ఉంది.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో  టీడీపీ గెలిచిన మూడు ఎంపీ స్థానాల్లో  విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం  స్థానాలు.  పార్టీకి ఎదురుగాలి వీచిన సమయంలో  కూడ  ఈ మూడు స్థానాల్లో  ఎంపీలు విజయం సాధించారు.

వచ్చే ఎన్నికల్లో విజయవాడలోని పశ్చిమ అసెంబ్లీ స్థానంలో  పోటీ విషయమై  నేతల మధ్య విభేదాలకు కారణంగా తెలుస్తోంది. విజయవాడలోని పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి  వచ్చే ఎన్నికల్లో  నాగుల్ మీరా పోటీ చేస్తారని విజయవాడ ఎంపీ కేశినేని నాని  ప్రకటించారు. చంద్రబాబుకు సంబంధం లేకుండా ఈ విషయాన్ని నాని ప్రకటించడంపై  ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అసంతృప్తితో ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రయత్నాలు చేసుకొంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో  ఈ  స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కూతురు పోటీ చేసి ఓటమి పాలైంది. ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు  నాగుల్ మీరా ప్రయత్నించాడు. జలీల్ ఖాన్ కూతురుకు టిక్కెట్టు కేటాయించాలని  నిర్ణయం తీసుకోవడంపై నాగుల్ మీరా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ విషయమై నాగుల్ మీరాను కేశినేని నాని చంద్రబాబునాయుడు వద్దకు తీసుకెళ్లారు.చంద్రబాబుతో సమావేశం తర్వాత నాగుల్ మీరా  మెత్తబడ్డారు.  అయితే ఇటీవల జరిగిన ఓ సమావేశంలో  పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి  నాగుల్ మీరా పోటీ చేస్తారని కేశినేని  నాని ప్రకటించడం  బుద్దా వెంకన్నకు అసంతృప్తిని కల్గించినట్టుగా చెబుతున్నారు.

టీడీపీ కార్పోరేటర్లతో కేశినేని నాని సమావేశం సందర్భంగా  చేసిన వ్యాఖ్యలు  ప్రస్తుతం బుద్దా వెంకన్నకు మంటలు పుట్టించాయి. విజయవాడ తూర్పు స్థానంలో విజయం సాధిస్తే, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానంలో 25 ఓట్లతో టీడీపీ ఓటమి పాలైంది. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానంలో వచ్చే ఎన్నికల్లో నాగుల్ మీరా పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు.

ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో కూడ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి  నాగుల్ మీరాను  పోటీకి దింపాలని కేశినేని నాని చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. అయితే  ఆ సమయంలో చంద్రబాబు వద్ద జిల్లాకు చెందిన కొందరు నేతలు వ్యతిరేకంగా చేశారని నాని అనుమానిస్తున్నారు. దీంతో చంద్రాబునాయుడు ఈ స్థానంలో జలీల్ ఖాన్ కూతురును బరిలోకి దింపినట్టుగా చెబుతున్నారు.

విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్‌లో వచ్చే ఎన్నికల్లో నాగుల్ మీరా పోటీ చేస్తారని కేశినేని నాని ప్రకటించడంపై బుద్దా వెంకన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన  నాని అనుచరుల వద్దే నిరసన వ్యక్తం చేశారు.

 ఈ మాటలు నానికి చేరాయి. దీంతో నాని ట్విట్టర్ వేదికగా బుద్ా వెంకన్నపై విమర్శలను గుప్పించారని చెబుతున్నారు. వరుసగా ట్వీట్లతో బుద్దా వెంకన్నపై నాని విమర్శలు చేశారు. నాని విమర్శలకు బుద్దా వెంకన్న కూడ కౌంటరిచ్చారు.

ట్వీట్ వార్  ఆదివారం నాడు పతాకస్థాయికి చేరింది. సోమవారం నాడు ట్వీట్ల యుద్దంలో కేశినేని నాని చంద్రబాబును కూడ లాగారు. ఈ విషయంపై టీడీపీ నాయకత్వం స్పందించింది.  ఇద్దరికి ఫోన్లు చేసి సంయమనం పాటించాలని సూచించింది. వీరిద్దరితో చంద్రబాబునాయుడు సమావేశమయ్యే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

ట్వీట్ల యుద్దం: కేశినేని నాని, బుద్దా వెంకన్నలకు హైకమాండ్‌ నుండి ఫోన్లు