అమరావతి: ట్విట్టర్ వేదికగా ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకొంటున్న కేశినేని నాని, బుద్దా వెంకన్నలకు టీడీపీ నాయకత్వం నుండి ఫోన్లు వచ్చాయి. ఈ ఇద్దరు నేతలు  చంద్రబాబుతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. 

టీడీపీ ఎంపీ కేశినేని నాని అదే పార్టీకి చెందిన బుద్దా వెంకన్నపై తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా  నాని చేసిన విమర్శలపై బుద్దా వెంకన్న కౌంటరిచ్చారు.   ఆదివారం నాడు బుద్దా వెంకన్న, కేశినేని నాని మధ్య ట్వీట్ల యుద్దం సాగింది.

ట్వీట్ల యుద్దం సోమవారం నాడు కూడసాగింది. ఈ పరిణామం పార్టీకి తీవ్ర నష్టాన్ని కల్గించేదిగా ఉందని భావించిన చంద్రబాబు ఇద్దరు నేతల మధ్య రాజీ చేసే ప్రయత్నాలను ప్రారంభించారు. ఇద్దరికి టీడీపీ అధినాయకత్వం సోమవారం నాడు ఫోన్ చేసింది. 

ఇద్దరు నేతలు తమ వాదనలను విన్పించారు. సంయమనం పాటించాల్సిందిగా ఇద్దరికి పార్టీ అధినాయకత్వం సూచించింది. ఇద్దరు నేతలతో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు.