జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు వైసీపీ మహిళా నేత పోతుల సునీత. దుశ్శాసనుడు, కీచకుడు మహిళల గురించి మాట్లాడినట్టు ఉందంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ పై (pawan kalyan) మండిపడ్డారు వైసీపీ (ysrcp) రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత (pothula suneetha) . పవన్ కళ్యాణ్ మహిళల గురించి మాట్లాడటం సిగ్గుచేటంటూ ఆమె దుయ్యబట్టారు. కుటుంబం, వివాహ బంధాల గురించి ఏమాత్రం ఆయనకు తెలియదంటూ సునీత ఎద్దేవా చేశారు. అతను ఒక సినిమా హీరో అని.. సినిమాల్లో లాగే మహిళల జీవితాలతో ఆడుకున్నారని ఆమె ఆరోపించారు. ముగ్గురిని వివాహం చేసుకున్న పవన్ మహిళల గురించి మాట్లాడుతున్నారని.. ఇప్పుడు ఇంకొక మహిళని చేసుకోబోతున్నారని అంటున్నారంటూ సునీత చురకలు వేశారు. భార్యాభర్తల బంధానికి ఎలాంటి నిర్వచనం ఇచ్చాడో చూడాలంటూ ఎద్దేవా చేశారు. అతనిది నీచ సంస్కృతని.. అలాంటి వ్యక్తికి మహిళల రక్షణ గురించి మాట్లాడే హక్కు లేదని పోతుల సునీత ఫైరయ్యారు.
దుశ్శాసనుడు, కీచకుడు మహిళల గురించి మాట్లాడినట్టు ఉందని.. పవన్ దగ్గరకు మహిళలు వెళ్లాలంటే వారికి రక్షణ కల్పించాల్సిన పరిస్థితి ఉందంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలపై ఎన్నో అరచకాలు జరిగాయని.. మరి ఆనాడు పవన్ ఎందుకు నోరు మెదపలేదని సునీత ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం దిశా చట్టాన్ని రూపొందించామని.. దిశా యాప్ వల్ల ఎంత ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకోవాలని ఆమె హితవు పలికారు.
ALso Read:సినిమాలో చేసే దాంట్లో కొంత చేసినా సంతృప్తి.. జనసేనకు ఆ అవకాశం: పవన్ సంచలనం
ముగ్గురికి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మహిళల రక్షణ గురించి మాట్లాడటం సిగ్గుచేటని పోతుల సునీత వ్యాఖ్యానించారు. సీఎం జగన్ మహిళల పక్షపాతిగా ఉన్నారని.. వారి అభ్యున్నతికి విద్య, వైద్యం, రాజకీయాలలో కూడా ప్రాధాన్యత ఇచ్చారని ఆమె ప్రశంసించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను మహిళల కోసం చేస్తున్నారని సునీత గుర్తుచేశారు. తంలో చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారని ఆమె ఆరోపించారు. కానీ జగన్ చంద్రబాబు చేసిన అప్పులను కూడా చెల్లిస్తూ డ్వాక్రా వారికి అండగా నిలిచారని పోతుల సునీత కొనియాడారు.
పవన్ కి మహిళలే తగిన బుద్ది చెప్తారని ఆమె జోస్యం చెప్పారు. అధికారమదంతో ప్రభుత్వం వ్యవహరిస్తుందనటం తప్పని.. 50% మహిళలకు ఉద్యోగాలు, పదవులు ఇస్తుంటే అలా మాట్లాడతారా అంటూ పోతుల సునీత ఫైరయ్యారు. పవన్ కల్యాణ్.. బస్సు యాత్ర కాదు, రైలు యాత్ర చేసినా ఎవరూ పట్టించుకోరని ఆమె వ్యాఖ్యానించారు.
