గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వైఎస్సార్ సీపీ బాగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల ఆదాయ జాబితాను పరిశీలిస్తే ఏపీ అధికార పార్టీ రెండో స్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ ఐదో స్థానంలో ఉంది.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆదాయాన్ని పొందడంలో ప్రాంతీయ పార్టీలో ఏపీలోని అధికార వైఎస్సార్ సీపీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. అలాగే తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఈ వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఆ సంస్థ నివేదిక ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో 31 ప్రాంతీయ పార్టీల్లో రూ. 108 కోట్ల ఆదాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్, రూ. 37.6 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అత్యధిక ఆదాయాన్ని కలిగి ఉన్నాయి.
NTR Jayanti: ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల నివాళులు.. భారతరత్న ఇవ్వాలన్న నామా..
ఈ వివరాలను బట్టి చూస్తే తెలుగు పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల నుండి గరిష్ట ఆదాయాన్ని పొందాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 31 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ. 529.4 కోట్లుగా ఉంది. ఇందులో డీఎంకే రూ.150 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది మొత్తం ఆదాయంలో 28 శాతంగా ఉంది. అలాగే అన్ని పార్టీలలో YSRC 20 శాతం, BJD రూ. 73 కోట్లతో 13 శాతం సంపాదించుకున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో DMK అత్యధికంగా రూ. 85 కోట్ల ఆదాయాన్ని పెంచుకుంది.
ఖరీదైన బుల్లెట్ బైకులే వారి టార్గెట్.. ఒక్క సారి కన్నుపడిందంటే ఇక అంతే..
YSRC దాని మొత్తం ఆదాయంలో గరిష్టం గా ఖర్చు చేయని (99శాతం) జాబితాలో అగ్రస్థానంలో ఉంది, BJD (90 శాతం) AIMIM (88 శాతం) తర్వా తి స్థానాల్లో ఉన్నాయి. టీడీపీ రూ.51కోట్లు, టీఆర్ఎస్ రూ.22 కోట్లు ఖర్చు చేశాయని పేర్కొన్నారు. ADR చేసుకున్న RTI దరఖాస్తుకు SBI ప్రతిస్పందించి సమాధానం ఇచ్చింది. ఈ వివరాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో పార్టీల ద్వారా రూ. 1,019 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు రీడీమ్ చేయబడ్డాయి.
సీఎం జగన్ ను అడ్డుతొలగించేందుకు చంద్రబాబు కుట్ర - మంత్రి మేరుగ నాగార్జున
‘‘ ఈ నివేదిక 2020-21 ఆర్థిక సంవత్సరంలో 54 ప్రాంతీయ పార్టీలో 31 పార్టీలు భారతదేశ ఎన్నికల కమిషన్ (ECI) కి సమర్పించిన ఆదాయపు పన్ను రిటర్న్లలో ప్రకటించిన మొత్తం ఆదాయం, ఖర్చులను విశ్లేషిస్తుంది ’’ అని ADR తెలిపింది. ఈసీకి నివేదికలు సమర్పించడంలో టీఆర్ఎస్ 71 రోజులు, టీడీపీ 74 రోజులు, వైఎస్ఆర్ సీపీ 133 రోజులు ఆలస్యం చేశాయని ఏడీఆర్ తెలిపింది.
