తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 120 స్థానాల్లో విజయం సాధించడం తథ్యమన్నారు మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్. మంగళవారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆయన వైసీపీ అధికారంలోకి రావాలని వేడుకున్నట్లు స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో 120 స్థానాల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. ప్రజల మద్దతు ఉన్న జగన్ కే ఉందని ఇప్పటికే పలు జాతీయ సంస్థలు సైతం తమ సర్వేలో వెల్లడించిందని స్పష్టం చేశారు. మే 23న వెల్లడయ్యే ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే వస్తాయని పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు.