ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు  సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సీఎం వైఎస్ జగన్‌తో భేటీ తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ  సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సీఎం వైఎస్ జగన్‌తో భేటీ తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు. వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, లాయర్ నిరంజన్ రెడ్డి, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభకు పంపనున్నట్టుగా చెప్పారు. 

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. బీసీల పట్ల చిత్తశుద్దిని వైసీపీ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోందని చెప్పారు. నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు బీసీలేనని తెలిపారు. ప్రత్యక్ష పోస్టులయినా.. నామినేటెడ్ అయినా వైసీపీది ఒకటే దారి అని అన్నారు. మూడేళ్లలో భర్తీ చేసిన అన్ని పోస్టుల్లో బీసీలకే ప్రాధన్యం ఇచ్చినట్టుగా చెప్పారు. టీడీపీ మాటలకే పరిమతమని.. తాము చిత్తశుద్దితో చేసి చూపిస్తున్నామని అన్నారు. ఇక, బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ బలహీనవర్గాలకు ఇంతగా అవకాశం ఇవ్వలేదని అన్నారు. నాలుగులో సగం స్థానాలు బలహీనవర్గాలకే ఇచ్చామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

Scroll to load tweet…

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను పరిశీలిస్తే.. ముందు నుంచి అనుకున్నట్టుగానే విజయసాయిరెడ్డికి మరోసారి రాజ్యసభ అవకాశం కల్పించారు. మొత్తం నలుగురు అభ్యర్థుల్లో రెడ్డి సామాజిక వర్గానికి రెండు స్థానాలు, బీసీ సామాజిక వర్గానికి రెండు స్థానాలు కేటాయించారు.