ఏపీకి  ప్రత్యేక హోదా ఇస్తాననే మాటను ప్రధాని మోడీ చెప్పకపోవడం చూస్తే ఏపీపై ఢిల్లీ పెద్దలకు ఉన్న ప్రేమను తెలియజేస్తోందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ వ్యంగ్యాస్రాలు సంధించారు. తిరుపతిలో  ఏపీ ప్రజలకు ఇచ్చిన హమీలు  గుర్తు లేదా అని జగన్ ప్రశ్నించారు.

అమరావతి:: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం, టీడీపీ తీరును నిరసిస్తూ జూలై 24న ఏపీ బంద్ కు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని జగన్ కోరారు.టీడీపీ ఎంపీలను రాజీనామాలు చేయాలని ప్రజలు ఒత్తిడి తేవాలని కోరారు. ఏ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తే ఆ పార్టీకే మద్దతు ఇస్తామని జగన్ ప్రకటించారు.తమ పార్టీ ఎంపీలను రాజీనామాలు చేయించి గెలిపించుకొనే ధైర్యం ఉందా అని జగన్ బాబును ప్రశ్నించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాననే మాటను ప్రధాని మోడీ చెప్పకపోవడం చూస్తే ఏపీపై ఢిల్లీ పెద్దలకు ఉన్న ప్రేమను తెలియజేస్తోందని జగన్ వ్యంగ్యాస్రాలు సంధించారు. తిరుపతిలో ఏపీ ప్రజలకు ఇచ్చిన హమీలు గుర్తు లేదా అని జగన్ ప్రశ్నించారు.

అవిశ్వాసంపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ శనివారం నాడు మీడియాతో మాట్లాడారు.రాష్ట్రం మీద ఢిల్లీ పెద్దలకు ఉన్న ప్రేమను చూస్తే బాధ అన్పిస్తోందని జగన్ చెప్పారు.బాబు ఆమోదంతోనే ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ ఇచ్చామని మోడీ చెప్పిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు.

ఏపీ ప్రజల హక్కులను తాకట్టు పెట్టే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు. పార్లమెంట్‌లో గల్లా జయదేవ్ మాట్లాడిన మాటలను నాలుగేళ్లుగా తమ పార్టీ చెబుతున్న మాటలే అని జగన్ గుర్తు చేశారు.

ప్రత్యేక హోదా వల్ల లాభం లేదని టీడీపీ నేతలు మాట్లాడలేదా అని బాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా సంజీవినా అంటూ తమను ఎద్దేవా చేయలేదా అని ఆయన ప్రశ్నించారు.

ప్రత్యేకహోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలని బాబు గతంలో పలు మార్లు ప్రకటించారన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన వెంటనే రాత్రికి రాత్రే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు.
అంతేకాదు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మాణం చేసిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా మహానాడులో తీర్మాణం చేసిన విషయాన్ని జగన్ మీడియా సమావేశంలో చూపారు.

బీజేపీతో యుద్ధం అంటూనే లోపాయికారిగానే ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారని జగన్ ఆరోపించారు. మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భార్యకు టీటీడీలో బోర్డు సభ్యురాలిగా నియమించారని చెప్పారు.కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా బాబు మా మిత్రుడే అని చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు.కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ ను సీఎంఓలో బాబు కొనసాగిస్తున్నారని జగన్ ఆరోపించారు.

వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సమయంలోనే టీడీపీ ఎంపీలు కూడ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా వచ్చేది కాదా అని జగన్ బాబును ప్రశ్నించారు.

మీ పార్టీకి చెందిన ఎంపీలను రాజీనామాలు చేయాలని జగన్ చంద్రబాబుకు సవాల్ విసిరారు. రెండు పార్టీలకు చెందిన ఎంపీలమంతా దీక్షకు కూర్చొందాం.. దేశమంతా మనవైపు చూస్తోంది.. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరో చూద్దామని జగన్ బాబుకు సవాల్ విసిరారు.

టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలనే డిమాండ్‌తో జూలై 24వ తేదీన ఏపీ బంద్ కు పిలుపు ఇస్తున్నట్టు జగన్ చెప్పారు. టీడీపీ ఎంపీలను రాజీనామాల కోసం ప్రజల నుండి ఎంత ఒత్తిడి ఉందనే విషయమై కేంద్రానికి తెలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు.

యుద్ధం అంటే సామాన్యుడు మనవైపు చూడాలన్నారు. 5 ఏళ్ళు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని బీజేపీ హమీ ఇవ్వలేదా అని జగన్ గుర్తు చేశారు.
ఏ పార్టీని నమ్మకూడదని జగన్ కోరారు. 25 మంది ఏంపీలను ఒక్కతాటిపైకి తీసుకొద్దామన్నారు.ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీ సంతకం పెడుతోందో ఆ పార్టీకి మద్దతిద్దామన్నారు జగన్.

 ప్రత్యేక హోదాపై ప్రజల నుండి వచ్చిన ఒత్తిడి మేరకు టీడీపీ యూ టర్న్ తీసుకొందని చెప్పారు.ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని జగన్ కోరారు.వైసీపీ ఎవరిని ట్రాప్ చేయలేదని జగన్ చెప్పారు.

తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించి గెలిపించుకొంటామనే ధైర్యం టీడీపీకి లేదని జగన్ చెప్పారు.ప్రధాని ఎవరైనా మాకు అభ్యంతరం లేదు... కానీ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడమే తనకు ముఖ్యమన్నారు.ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికే తన మద్దతు ఉంటుందని జగన్ ప్రకటించారు.