వచ్చే ఎన్నికల్లో అద్దంకి నుండి వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ చెంచు గరటయ్య చెప్పారు.
అద్దంకి: వచ్చే ఎన్నికల్లో అద్దంకి నుండి వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ చెంచు గరటయ్య చెప్పారు. పార్టీ తనకే టిక్కెట్టు ఇస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
సోమవారం నాడు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనాలతో ర్యాలీగా అద్దంకికి ఆయన చేరుకొన్నారు.
రాజన్న పాలన రావాలన్నా రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలన్నా వైసీపీతోనే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అద్దంకి నియోజకవర్గంలోని అరికట్టవారిపాలెం గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత ఆయన కార్యకర్త ల సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్‌ను సీఎం చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
