కాకినాడ: టీడీపీ నేతలపై ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుల దాడి, ఉద్రిక్తత

తూర్పుగోదావరి (East Godavari) జిల్లా టీడీపీ (TDP) కార్యాలయం వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా టీడీపీ నేతలు కొండబాబు, నవీన్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.

ysrcp activists attack on tdp leaders in kakinada

తూర్పుగోదావరి (East Godavari) జిల్లా టీడీపీ (TDP) కార్యాలయం వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా టీడీపీ నేతలు కొండబాబు, నవీన్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. మాజీ మంత్రి చినరాజప్ప (nimmakayala chinarajappa), మాజీ జడ్పీ ఛైర్మన్‌ జ్యోతుల నవీన్‌ (jyothula naveen), మాజీ ఎమ్మెల్యే కొండబాబుతో (kondababu) కలిసి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ (pattabhiram) మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్న డ్రగ్స్‌ (drugs), గంజాయికి సంబంధించిన విషయాలపై పట్టాభి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ కాకినాడ (kakinada) నగర వైసీపీ(ysrcp) ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై (dwarampudi chandrasekhar reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. డ్రగ్స్‌ రాకెట్‌లో ద్వారంపూడి హస్తం ఉందని పట్టాభి ఆరోపించారు. 

Also Read:గంజాయిపై ఉక్కుపాదం.. అదే, టీడీపీ నేతలకు కడుపుమంట: మంత్రి కన్నబాబు వ్యాఖ్యలు

గత నెలలో  కాకినాడ జగన్నాథపురం వద్ద ఉప్పుటేరులో బోటు దగ్ధమైన ఘటనలో హెరాయిన్‌ ఉండటం వల్లే తెల్లటి పొగలు వచ్చాయని, ఆఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టలేదని ఆయన ఆరోపణలు చేశారు. అనంతరం కాకినాడ సీ పోర్టులో తెలుగుదేశం బృందం పర్యటించి జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఈక్రమంలో కొండబాబు, నవీన్‌ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా.. ఒక్కసారిగా ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు, బోటు నిర్వాహకులు వచ్చి దాడికి పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు.. నవీన్‌, కొండబాబును పార్టీ కార్యాలయంలోనికి తీసుకెళ్లారు. పట్టాభి కూడా పార్టీ కార్యాలయంలోనే ఉండటంతో టీడీపీ నేతలకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు, బోటు నిర్వాహకులు నినాదాలు చేశారు. ఈ ఘటనతో కాకినాడ నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  సమాచారం అందుకున్న పోలీసులు టీడీపీ, వైసీపీ కార్యాలయాల వద్ద భారీగా మోహరించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios