అనంతపురంలో వైసీపీ వంచన దీక్ష

First Published 2, Jul 2018, 10:37 AM IST
ysrcongress vanchana pai garjana deeksha at ananthapuram
Highlights

అనంతపురంలో వైసీపీ వంచన దీక్ష

ప్రత్యేకహోదాతో పాటు విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి.. కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘వంచనపై గర్జన’ అనంతపురంలో ప్రారంభమైంది. నగరంలోని క్లాక్ టవర్ సమీపంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రత్యేకహోదా కోసం రాజీనామాలు చేసిన ఎంపీలు హాజరయ్యారు. దీక్ష ప్రారంభానికి ముందు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ దీక్షకు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి.

loader