అమరావతి:ఆంధ్రప్రదేశ్‌ రాజధాని గ్రామాల్లో బంద్ పాటిస్తున్నారు.సోమవారం రైతులపై జరిగిన పోలీసుల లాఠీ ఛార్జికి నిరసనగా అమరావతి ఐకాస బంద్‌ కు పిలుపునిచ్చింది. దీంతో రాజధాని లోని 29 గ్రామాలు బంద్‌లో పాల్గొంటున్నాయి.తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలో  వైస్సార్ విగ్రహనికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేశారు.

Also Read: అసెంబ్లీ మెట్లపై మౌనదీక్ష, పాదయాత్ర: చంద్రబాబు సహా ఎమ్మెల్యేల అరెస్టు.

 బంద్‌ నేపథ్యంలో పోలీసులకు పూర్తిగా సహాయ నిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు. మంచినీరు సహా ఏ పదార్థాలు పోలీసులకు విక్రయించకూడదని, పోలీసులు అడ్డుకుంటే జాతీయ జెండాలతో నిరసనలు తెలపాలని నిర్ణయించారు.రాజధాని గా అమరావతి నే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 35 వ రోజుకు చేరుకున్నాయి. శాసన సభలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందినా రైతులు తమ నిరసనలు ఆపడం లేదు. 

Also Read: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అరెస్ట్: రిమాండ్‌కు తరలింపు

మందడం, తుళ్లూరులో మహా ధర్నాలు జరుగుతున్నాయి. వెలగపూడి, కృష్ణాయ పాలెంలో రైతులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.ఉద్దండరాయుని పాలెంలో రైతులు, మహిళలు నిరసన తెలుపుతూ పూజలు నిర్వహిస్తున్నారు. రాజధాని గ్రామాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు రాజధానిపై ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. బంద్ నేపథ్యంలో తుళ్ళూరులో పోలీస్ బలగాలు భారీగా మోహరించారు.