గుంటూరు: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌పై  పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. మంగళవారం నాడు తెల్లవారుజామున మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఈ నెల 31వ తేదీ వరకు  మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. 

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు అసెంబ్లీ ఎదుట ధర్నాకు ఎంపీ గల్లా జయదేవ్ ప్రయత్నించారు. ఈ సమయంలో జయదేవ్ చొక్కాను పోలీసులు చించివేశారు.

Also read:మూడు రాజధానులు: అసెంబ్లీ ముట్టడి, గల్లా జయదేవ్ చొక్కాను చించిన పోలీసులు

పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ను సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.  గల్లా జయదేవ్ పై పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. 

Also Read:టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూములివే: అసెంబ్లీలో బయటపెట్టిన మంత్రి బుగ్గన

మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు మంగళవారం నాడు తెల్లవారుజామున పోలీసులు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను పోలీసులు  పోలీస్ స్టేషన్లు తిప్పారు  గల్లా జయదేవ్  కోసం టీడీపీ కార్యకర్తలు, తెలుగు యువత కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరిగారు.

మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ను పోలీసులు హాజరుపర్చారు. గల్లా జయదేవ్ కు బెయిల్ ఇచ్చేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను తరలించారు.

సోమవారం నాడు పోలీసుల ఆంక్షలను దాటుకొని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత జయదేవ్ ను దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు మీదుగా నరసరావుపేట నుండి రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పోలీసుల ఆంక్షలను ఉల్లఘించినందుకు గాను ఎంపీ గల్లా జయదేవ్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రొంపిచర్ల పోలీస్ స్టేషన్ నుండి గుంటూరుకు అర్ధరాత్రి తీసుకొచ్చారు.  మంగళవారం తెల్లవారుజామున పోలీసులు మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు జయదేవ్ ను హాజరుపర్చారు.