వైఎస్ఆర్ రైతు భరోసా : రేపే 53.53 లక్షలమంది ఖాతాల్లో రెండో విడత నగదు జమ...
వైఎస్ఆర్ రైతు భరోసా - సీఎం కిసాన్ కింద మొదటి విడతలో 52,57,263 మంది అర్హత పొందగా వీరిలో 50,19,187 మంది భూ యజమానులే ఉన్నారు.

పుట్టపర్తి : ఈ ఏడాది రెండో విడత వైయస్సార్ రైతు భరోసా నగదు మంగళవారం నాడు రైతుల ఖాతాల్లో జమకానుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతు భరోసా - సీఎం కిసాన్ నగదు నిధులను బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో వైఎస్ జగన్ ఈనెల ఏడవ తేదీన పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో మంగళవారం ఉదయం ఈ నగదు జమ కానుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టపర్తి పర్యటన నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంటలకే తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరుతారు.
సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకున్న తర్వాత అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రసంగం అనంతరం వైయస్సార్ రైతు భరోసా - సీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో వేదిక మీద నుంచే బటన్ నొక్కి జమ చేస్తారు. 53.53 లక్షల మంది ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు జమకానున్నాయి. మొత్తం రూ.2,204.77 కోట్లు జమ చేస్తారు. ఇక రైతు భరోసా తొలి విడత లో 52.52 లక్షల మందికి రూ.3,942.95 కోట్ల మేర సాయాన్ని అందించారు. తొలి విడతలో ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 7,500 చొప్పున జమ చేశారు.
విజయవాడలో బస్సు బీభత్సం.. రివర్స్ గేర్ కు బదులు, ఫస్ట్ గేర్.. ముగ్గురు మృతి..
నగదు జమ చేసిన తర్వాత వైఎస్ జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. రెండో విడతలో ఒక్కొక్కరి ఖాతాలో రూ. 4వేల చొప్పున జమ కానుంది. వైయస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతలుగా నగదును జమ చేయనున్నారు. అర్హులైన రైతు కుటుంబాలకు దీని కింద మొత్తంగా ఏడాదికి రూ.13,500 పెట్టుబడి సాయం అందుతోంది. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతలో 52,57,263 మంది అర్హత పొందగా వీరిలో 50,19,187 మంది భూ యజమానులు ఉన్నారు.
1,46,324 మంది కౌలు దారులు, 91,752 మంది అటవీ భూ సాగుదారులు ఉన్నారు. మొదటి విడతలో ఒక్కొక్కరికి 7500 చొప్పున జూన్ ఒకటవ తేదీన భూ యజమానులకు.. సెప్టెంబర్ ఒకటవ తేదీన కౌలుదారులు, అటవీ సాగుదారులకు సాయం అందించింది. ఇక ఇప్పుడు రెండో విడతలో మొత్తంగా 53,52,905మంది అర్హత పొందిన రైతులకు సాయం అందించనున్నారు.