బ్రేకులు ఫెయిలై బస్సు ఫ్లాట్ ఫాం మీదికి వెళ్లింది. దీంతో ప్రమాదం జరిగి ముగ్గురు మృత్యవాత పడ్డారు. 

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో సోమవారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రూ బస్టాండ్ లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కండక్టర్, ఓ మహిళా ప్రయాణికురాలు మృతి చెందారు. ప్లాట్ఫామ్ 12 దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన ఏపీ సర్వీసు మెట్రో లగ్జరీ బస్సు ప్రమాదానికి గురైంది. బ్రేక్ ఫెయిలై ఫ్టాట్ ఫాం పైకి దూసుకెళ్లిన దూసుకెళ్లింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

డ్రైవర్ రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడమే ప్రమాదానికి కారణం అని డిపో ఆర్ఎం చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కండక్టర్, మహిళా ప్రయాణికురాలు, రెండున్నరేళ్ల బాబు.. ముగ్గురు మృతి చెందారు. బస్సు ప్రయాణికుల మీదికి దూసుకువచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.