Asianet News TeluguAsianet News Telugu

రేపే ''జగనన్న చేదోడు'' పథకం ప్రారంభం ...రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం

కరోనా కష్టకాలంలోనూ ప్రతీ కుటుంబానికి అండగా నిలబడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాల జోరు కొనసాగిస్తున్నారు.

YSR Jagananna Chedodu Scheme Launched tomorrow
Author
Amaravathi, First Published Jun 9, 2020, 9:41 PM IST

అమరావతి: కరోనా కష్టకాలంలోనూ ప్రతీ కుటుంబానికి అండగా నిలబడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాల జోరు కొనసాగిస్తున్నారు. వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, టైలర్‌(దర్జీ) అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం జగనన్న చేదోడు పేరుతో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. రేపే సీఎం జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

 ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందనుంది. ఈ డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌లతో మాట్లాడి లబ్దిదారుల అన్‌ఇన్‌కంబర్డ్‌ అకౌంట్లకు ఈ నగదు జమ చేయనున్నారు. 

read more   ప్రకాశంలో బాబుకి గట్టి ఎదురుదెబ్బ: వైసీపీలోకి మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు

షాపులున్న 1,25,926 మంది టైలర్లకు 125,92,60.000రూపాయలు, 82,347  మంది రజకులకు 82,34,70.000 రూపాయలు, 38,767 మంది నాయీబ్రాహ్మణులకు  38,76,70.000రూపాయలు ఇలా మొత్తంగా  2,47,040 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. ఈ లబ్దిదారులు వారి వృత్తికి అవసరమగు చేతి పనిముట్లు, చేతి పెట్టుబడి కోసం ఈ ఆర్దిక సాయాన్ని వినియోగించుకుని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని వైసిపి ప్రభుత్వం ఇదివనరకే వెల్లడించింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios