అమరావతి:వైద్యం కోసం ఎవరూ కూడ అప్పుల పాలు కాకుండా ఉండకూదనేది తమ ఉద్దేశ్యమని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.గురువారం నాడు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో  ఆరోగ్య శ్రీ పథకాన్ని విస్తరించే కార్యక్రమాన్ని సీఎం జగన్ అమరావతిలో ప్రారంభించారు.

విజయనగరం, విశాఖ, గుంటూరు, కడప, ప్రకాశం, కర్నూల్ జిల్లాల్లో ఈ పథకాన్ని విస్తరించనుంది ప్రభుత్వం. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పథకం పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేశారు.

వెయ్యి రూపాయాల ఖర్చు దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి  వైద్యాన్ని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం.ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆసుపత్రులకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో 13 వేల విలేజ్ క్లినిక్‌లు ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు.

also read:జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ, మరో 6 జిల్లాలకు విస్తరింపు

వైద్యం కోసం పేదలకు ఎవరూ కూడ ఇబ్బందిపడకూడదనేది తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం జగన్ చెప్పారు. ఆరోగ్య శ్రీ బకాయిల చెల్లింపుల్లో ఎలాంటి ఆలస్యం ఉండదని ఆయన హామీ ఇచ్చారు. ఆరోగ్య రంగంలో పూర్తిగా మార్పులు తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.

నాడు నేడు కార్యక్రమంతో ఆసుపత్రుల రూపు రేఖలను మారుస్తామని ఆయన తెలిపారు.ఆసుపత్రులకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. నెట్ వర్కింగ్ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో ఇప్పటికే 65 లక్షల  మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించినట్టుగా ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని సర్వర్ లో భద్రపరుస్తున్నామని సీఎం తెలిపారు. ఆరోగ్య శ్రీ పరిధిని విస్తరిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.