జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ, మరో 6 జిల్లాలకు విస్తరింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని  విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. వెయ్యి రూపాయాల ఖర్చు దాటితే ఆరోగ్య శ్రీని వర్తింపచేయనుంది ప్రభుత్వం. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ఈ పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో దీన్ని విస్తరించనున్నారు.

andhra pradesh government extened arogyasri pilot programme another six districts

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని  విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. వెయ్యి రూపాయాల ఖర్చు దాటితే ఆరోగ్య శ్రీని వర్తింపచేయనుంది ప్రభుత్వం. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ఈ పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో దీన్ని విస్తరించనున్నారు.

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. 

ఆరోగ్యశ్రీలో ప్రస్తుతం 2200 రోగాలను చేర్చారు.  ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సహాయం అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ హామీకి అనుగుణంగానే ఈ పథకాన్ని మరింత విస్తరిస్తున్నారు. వెయ్యి రూపాయాలు దాటితే ఆరోగ్యశ్రీ కింద రోగులకు చికిత్స అందించనున్నారు.

ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లాలో ఈ పథకాన్ని ఈ ఏడాది జనవరి 3వ తేదీన ప్రారంభించింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ పథకం సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఈ పథకాన్ని మరో ఆరు జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కడప, కర్నూల్, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కూడ ఈ పథకాన్ని విస్తరించనున్నారు. కొత్త వెసులుబాట్లతో ఈ ఆరు జిల్లాల్లో ఆరోగ్యశ్రీని అమలు చేయనున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios