దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో అరెస్టైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లను పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్డులో పోలీసులు సోమవారం హాజరుపరిచారు.

ఈ మేరకు న్యాయమూర్తి నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కడపలోని కేంద్ర కారాగారం నుంచి పులివెందులలోని సబ్‌ జైలుకు తమను తరలించాలని నిందితులు పెట్టుకున్న పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. వారి విజ్ఞప్తిని మన్నించి ముగ్గురు నిందితులను పులివెందులలోని సబ్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది.