Asianet News TeluguAsianet News Telugu

నన్ను కావాలనే వైఎస్ వివేకా మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు..: హైకోర్టులో గంగిరెడ్డి క్వాష్ పిటిషన్

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో తనను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ సిబిఐ ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎర్ర గంగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. 

erra gangireddy filed Quash Petition  in AP High Court Over YS Viveka Murder Case
Author
Amaravathi, First Published Dec 2, 2021, 2:00 PM IST

అమరావతి: ఏపీ సీఎం జగన్ కు స్వయాన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల వివేకా డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎర్ర గంగిరెడ్డి పేరును కూడా దస్తగిరి బయటపెట్టిన విషయం తెలిసిందే. 

అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఏపీ హైకోర్టులో erra gangireddy క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి కావాలనే తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని గంగిరెడ్డి  Quash Petition లో పేర్కొన్నారు. గంగిరెడ్డి తరుపున సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు ఈ పిటిషన్ ధాఖలు చేశారు.

ys vivekananda reddy murder  హత్యకేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయట వున్నారు. అయితే ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని... వెంటనే గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని ఇటీవల సిబిఐ కోర్టు కడప కోర్టును కోరింది. బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సిబిఐ వాదనతో ఏకీభవించలేదు. దీంతో బెయిల్ కొనసాగుతుందంటూ తీర్పునిచ్చి గంగిరెడ్డికి ఊరటనిచ్చింది.  

read more  YS Vivekananda Reddy Murder కేసులో ట్విస్ట్: సీబీఐ ఒత్తిళ్లంటూ అనంతపురం ఎస్పీకి గంగాధర్ రెడ్డి ఫిర్యాదు

ఇదిలావుంటే ఇటీవల వివేకా హత్యకు సంబంధించిన సంచలన విషయాలను ఆయన డ్రైవర్ దస్తగిరి CBI అధికారులకు తెలిపెతూ ఓ వాంగ్మూలం ఇచ్చాడు. ఇందులో చాలామంది పెద్దతలకాయల పేర్లున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్ర గంగిరెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడని శంకర్ రెడ్డి తనకు చెప్పినట్టు Dastagiri పేర్కొన్నాడు. అంతేకాదు హత్య జరిగిన తర్వాత తనతో సహా కొంతమందిమి శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు... అప్పుడు కూడా తమకేమీ సమస్య రాకుండా ఎర్ర గంగిరెడ్డి చూసుకుంటారని శంకర్ రెడ్డి హామీనిచ్చిట్టు దస్తగిరి పేర్కొన్నాడు. 

ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి కుట్రపన్నినట్లు దస్తగిరి పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని.. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని, మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. 

read more  YS Viveka Murder Case: కీలక పరిణామం... వైసిపి రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డి అరెస్ట్?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్‌ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్లు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేయడంతో ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్‌రెడ్డిని ఆఫీసుకు పిలిపించి తిట్టినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి వెల్లడించారు. తర్వాత కొన్ని రోజుల పాటు వైఎస్ వివేకా, గంగిరెడ్డి మధ్య మాటల్లేవని... కోటి రూపాయిలు ఇస్తాం.. వివేకాను హత్యచేయాలని, గంగిరెడ్డి ఆఫర్ చేసినట్టు దస్తగిరి వెల్లడించారు. మొత్తం హత్యకు 40 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారని.. తనకు 5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి.. కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్టు దస్తగిరి చెప్పారు. అయితే తనకు ఇచ్చిన అడ్వాన్స్‌లో 25 లక్షలను సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios