Asianet News TeluguAsianet News Telugu

వివేకా హత్య కేసు: సిట్ ఎదుట హజరైన ఆదినారాయణ రెడ్డి సోదరుడు

వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డి గురువారం సిట్ ముందు హాజరయ్యారు

ys vivekananda reddy murder case devagudi narayana reddy to attend sit enquiry
Author
Kadapa, First Published Dec 5, 2019, 3:23 PM IST

వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డి గురువారం సిట్ ముందు హాజరయ్యారు. విచారణలో భాగంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. 

మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను ఎందుకు విచారణకు పిలిచారో అర్థం కావడం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. వైయస్ వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 

Also Read:వైఎస్ వివేకా హత్యకేసు: సిట్ విచారణకు టీడీపీ ఎమ్మెల్సీ, ఏమన్నారంటే...

వైయస్ వివేకా హత్యపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తున్న తరుణంలో తనను విచారణకు పిలిచారని తెలిపారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. సిట్ బృందం తనకు నోటీసులు ఇవ్వడంతోనే కడపకు వచ్చినట్లు తెలిపారు బీటెక్ రవి. 

బీటెక్ రవితోపాటు మరొకరు పరమేశ్వర్ రెడ్డి కూడా సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీటెక్ రవితోపాటు పరమేశ్వర్ రెడ్డికి కూడా సిట్ దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

కడప జిల్లాలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో జిల్లా ఎస్పీ అన్బురాజన్ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. ఇకపోతే బుధవారం వైయస్ వివేకానందరెడ్డి డ్రైవర్లను సిట్ బృందం విచారించింది. వారి వివరాల ప్రకారం బీటెక్ రవిని విచారణకు పిలిచినట్లు సమాచారం. 

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంది సిట్ దర్యాప్తు బృందం. నాలుగు నెలలుగా జరుగుతున్న సిట్ బృందం విచారణ తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. మరో వారం రోజులపాటు విచారించి అనంతరం వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది.  

Also read: వైఎస్ వివేకా హత్యకేసులో కీలక మలుపు: టీడీపీ ఎమ్మెల్సీకి నోటీసులు

ఈ కేసులో వైయస్ వివేకానందరెడ్డి సోదరులు, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డిలతో పాటు కొందరు టీడీపీ నేతలను రహస్యంగా విచారించారు. ఇకపోతే బుధవారం కూడా మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి కారు డ్రైవర్ లు దస్తగిరి, ప్రకాష్ అనే వ్యక్తిని సిట్ బృందం విచారించింది.

Follow Us:
Download App:
  • android
  • ios