రేపు విచారణకు రావాలి: సీబీఐ కార్యాలయం నుండి వెనుదిరిగిన వైఎస్ అవినాష్ రెడ్డి
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ నెల 18వ తేదీన ఉదయం విచారణకు రావాలని సీబీఐ అధికారులు వైఎస్ అవినాస్ రెడ్డిని కోరారు. ఈ విషయమై నోటీసులు పంపారు.
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ నెల 18వ తేదీ ఉదయం 10:30 గంటలకు విచారణకు రావాలని సీబీఐ అధికారులు కోరారు. దీంతో సోమవారంనాడు మధ్యాహ్నం సీబీఐ కార్యాలయం వరకు వెళ్లి వైఎస్ అవినాష్ రెడ్డి వెనుదిరిగారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ మధ్యాహ్నం విచారణకు రావాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నిన్న నోటీసులు జారీ చేసింది. దీంతో సోమవారంనాడు తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం విచారణ ప్రారంభమైంది. ఈ విచారణ సమయంలో సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచినట్టుగా న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. అయితే ఇవాళ సాయంత్రం ఐదు గంటల తర్వాతే వైఎస్ అవినాష్ రెడ్డిని విచారిస్తామని సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు
నిన్న సీబీఐ ఇచ్చిన నోటీసు మేరకు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు హైద్రాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వైఎస్ అవినాష్ రెడ్డి చేరుకున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా జరిగిన వాదనల నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డిని రేపు విచారించాలని సీబీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవాళ మరోసారి నోటీసు ఇచ్చారు. రేపు ఉదయం 1030 గంటలకు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డిని కోరారు సీబీఐ అధికారులు. ఇవాళ విచారణ లేకపోవడంతో సీబీఐ కార్యాలయం నుండి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయారు.
also read:వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్: ట్విస్టిచ్చిన వైఎస్ సునీతా రెడ్డి
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డని నిన్న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో నిందితులు ఉన్నారని సీబీఐ ఆరోపిస్తుంది. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి సూత్రధారులుగా సీబీఐ ఆరోపణలు చేస్తుంది. గతంలో పలుమార్లు వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసాన్ని సీబీఐ అధికారులు పరిశీలించారు. నిన్న తండ్రిని అరెస్ట్ చేసి ఇవాళ తనను విచారణకు రావాలని సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వడంతో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఏ రకమైన ఆదేశాలు ఇవ్వనుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రేపు ఉదయం సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు కానున్నారు.