వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్: ట్విస్టిచ్చిన వైఎస్ సునీతా రెడ్డి
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డ ముందస్తు బెయిల్ పిటిషన్ లో తన వాదనలు కూడా వినాలని వైఎస్ సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ లో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ ను దాఖలు చేశారు. సోమవారంనాడు ఉదయం తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో తన వాదనలు కూడా వినాలని వైఎస్ సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.
నిన్న ఉదయం పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ విచారణకు రావాలని సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. దీంతో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితుల కుటుంబ సభ్యులతో వైఎస్ వివేకానందరెడ్డికి వివాహేతర సంబంధం ఉందని వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాదు వైఎస్ వివేకకానందరెడ్డి రెండో భార్యకు ఆస్తి రాసివ్వాలని నిర్ణయం తీసుకున్నారని కూడా పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబంలో ఉన్న ఆస్తి గొడవలను ఆయన ప్రస్తావించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు తనకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.
also read:రేపు విచారణకు రావాలి: సీబీఐ కార్యాలయం నుండి వెనుదిరిగిన వైఎస్ అవినాష్ రెడ్డి
అయితే తన తండ్రి పేరును అప్రదిష్టపాలు చేసేలా ప్రచారం చేస్తున్నారని వైఎస్ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డిపై చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు
గతంలో కూడ వైఎస్ అవినాష్ రెడ్డి , వైఎస్ వివేాకనందరెడ్డి హత్య కేసు నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై వైఎస్ సునీతారెడ్డి పిటిషన్లు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ, టీడీపీతో వైఎస్ సునీతారెడ్డి కుమ్మక్మైందని వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతా రెడ్డి వెర్షన్ కొంతకాలంగా మారిందని వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు.