వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: విచారణ మార్చి 10కి వాయిదా

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను  మార్చి  10వ తేదీకి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. 

YS Vivekananda Reddy murder case: CBI Court Adjourns Hearing on March 10


హైదరాబాద్:  మాజీ మంత్రి వైఎస్ వివేకాకనంద రెడ్డి హత్య  కేసు విచారణను  ఈ ఏడాది మార్చి  10వ తేదీకి  వాయిదా వేసింది సీబీఐ కోర్టు .వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో  ఐదుగురు నిందితులను  ఇవాళ  సీబీఐ కోర్టులో  హజరుపర్చారు.  కడప జైలులో  ఉన్న ముగ్గురు నిందితులను  ప్రత్యేక వాహనంలో  పోలీసులు బందోబస్తు మధ్య  హైద్రాబాద్ కు తరలించారు.  ఈ కేసులో బెయిల్ పై  ఉన్న ఎర్ర గంగిరెడ్డి,  దస్తగిరిలు కూడా  కోర్టుకు హాజరయ్యారు. కడప జైలులో  ఉన్న  నిందితులను  చంచల్ గూడ జైలుకు తరలించాలని  కోర్టు ఆదేశించింది.  దీంతో నిందితులను చంచల్ గూడ  జైలుకు పోలీసులు తరలించారు.   

2019 మార్చి  19వ తేదీన  పులివెందులలోని తన నివాసంలో  వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు.   ఈ కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో విచారణ  జరిపించాలని  వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.  ఈ కేసు విచారణను  తెలంగాణకు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైద్రాబాద్ లో గల   ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు ఈ కేసును విచారించనుంది. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను  కడప నుండి  ఈ ఏడాది జనవరి  24వ తేదీన తరలించారు.  

ఈ  కేసు విచారణ ఇక నుండి హైద్రాబాద్ కేంద్రంగా జరగనుంది. దీంతో  ఈ కేసులో  జైలులో ఉన్న నిందితులను కడప నుండి  హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు. జైలులో  ఉన్న నిందితులను హైద్రాబాద్ చంచల్ గూడ జైలులో  ఉంటారు. 

also read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరైన నిందితులు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసు విషయమై  ఇటీవలనే  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. అవినాష్ రెడ్డి  కాల్ డేటా ఆధారంగా   కూడా సీబీఐ అధికారులు దర్యాప్తు  చేస్తున్నారు.   వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో  జగన్  పై బురదచల్లేందుకు  టీడీపీ ప్రయత్నం చేస్తుందని  వైసీపీ  ఆరోపిస్తుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios