వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరైన నిందితులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులను ఇవాళ హైద్రాబాద్ నాంపల్లిలో గల సీబీఐ కోర్టులో హజరుపర్చారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులను హైద్రాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు శుక్రవారంనాడుహజరుపర్చారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను హైద్రాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. దీంతో ఈ కేసు విచారణ చేస్తున్న కోర్టులో నిందితులను హజరుపర్చారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులను ఇవాళ హైద్రాబాద్ నాంపల్లిలో గల సీబీఐ కోర్టులో హజరుపర్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలను ప్రోటెక్షన్ వారంట్ జారీ అయింది.
కడప జైలులో ఉన్న నిందితులను బందోబస్తు మధ్య ఇవాళ తెల్లవారుజామున హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు. ఈ కేసులో బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను కూడా సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు.
2019 మార్చి 19వ తేదీన పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ కేసును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో విచారణ జరిపించాలని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైద్రాబాద్ లో గల ప్రిన్సిపల్ సీబీఐ కోర్టు ఈ కేసును విచారించనుంది. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను కడప నుండి ఈ ఏడాది జనవరి 24వ తేదీన తరలించారు.
ఈ కేసు విచారణ ఇక నుండి హైద్రాబాద్ కేంద్రంగా జరగనుంది. దీంతో ఈ కేసులో జైలులో ఉన్న నిందితులను కడప నుండి హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు. జైలులో ఉన్న నిందితులను హైద్రాబాద్ చంచల్ గూడ జైలులో ఉంటారు.