వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ రాజకీయాలపై క్లారిటీ ఇచ్చారు. జగన్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలపై అనేక అంశాలు ప్రస్తావించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్ పని తీరును అభినందించారు. అదే సమయంలో చంద్రబాబునాయుడు పనితీరుపై రాష్ట్రంలోని ప్రజలు పడుతున్న సమస్యలను కూడా ప్రస్తావించారు.

ఇంటర్వ్యూ సందర్భంలో విజయమ్మ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలను కూడా ప్రస్తావించారు. వైఎస్ మరణించిన తర్వాత పులివెందులకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయమ్మ పోటీ చేసి గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం తనకు రాజకీయాల్లోకి దిగే ఆశక్తి లేదన్నారు. అయితే, జగన్, ప్రజలు గనుక తన అవసరం ఉందనుకుంటే రాజకీయాల్లోకి దిగటానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

జగన్ కు మద్దతుగా తాను, కూతురు షర్మిల కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యాత్రలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ పై అన్యాయంగా కేసులు బనాయించి జైల్లో పెట్టారంటూ కాంగ్రెస్, టిడిపిపై మండిపడ్డారు.