వైసిపికి ఓటెయ్యకండి.. జగనన్నకు గెలిపించకండి..: వైఎస్ సునీత
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు చెల్లెల్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సొంత చెల్లి షర్మిల రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంటే మరో చెెల్లి సునీత వ్యక్తిగతంగా దోషిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.
న్యూడిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు ఆయన కూతురు వైఎస్ సునీతా రెడ్డి. తనకు చట్టపరంగా న్యాయం జరగడంలేదు కాబట్టి ప్రజాకోర్టులో తీర్పు కావాలని ఆమె కోరారు. తన తండ్రి హత్య, ఆ తర్వాత జరిగిన ఘటనలన్నీ ప్రజలందరి తెలుసు... కాబట్టి వాళ్లవళ్లే తనకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని అన్నారు. రాష్ట్రంలో ఇకపై హత్యారాజకీయాలు వుండకూడదనే తాను పోరాటం చేస్తున్నారు... అందుకు ఇప్పుడు ప్రజల సహకారం అవసరం అన్నారు. దయచేసి జగనన్నకు ఓటేయొద్దు... వంచన, మోసం చేసే వైసిపి మళ్లీ గెలిపించొద్దని వైఎస్ సునీత ఏపీ ప్రజలను కోరారు.
తన తండ్రి వివేకా హత్యోదంతంలో జగన్ పాత్రపై విచారణ జరపాలని సునీత కోరారు. హత్య జరిగిన కొద్దిసేపటికే తన బాబాయ్ ని గొడ్డలితో నరికి చంపారని జగన్ అన్నారు... ఈ విషయం ఆయనకు ఎలా తెలిసింది? అని ప్రశ్నించారు. ఆ తర్వాత కూడా జగనన్న తీరు తనకు అనేక అనుమానాలు రేకెత్తించిందని అన్నారు. కాబట్టి జగనన్న నుండి అసలు నిజాలు రాబట్టాలని... ఆయన దోషి అయితే శిక్షించాలి... నిర్దోషి అయితే వదిలేయాలని సునీత కోరారు.
మొదట్లో తన తండ్రి హత్యగురించి జగనన్నతో మాట్లాడినప్పుడు ఎలాంటి అనుమానం రాలేదని సునీత తెలిపారు, ... సొంత కుటుంబసభ్యులను కూడా అనుమానించడం మంచిదికాదని అనుకున్నా... కానీ ఆ తర్వాత ఒక్కో వాస్తవం బయటకు వచ్చిందన్నారు. ఆ తర్వాత అందరినీ అనుమానించాల్సి వచ్చిందన్నారు. ఇక ఈ కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని జగనన్నను కోరానని... అప్పుడు ఆయన అవినాష్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారని తెలిపారు. సిబిఐ విచారణకు వెళితే అవినాష్ బిజెపిలో చేరతాడని జగన్ అన్నట్లు సునీతారెడ్డి వెల్లడించారు.
రసవత్తరంగా పులివెందుల పాలిటిక్స్ ... వైసిపి గూటికి వైఎస్ జగన్ ప్రత్యర్థి
తన తండ్రిని హతమార్చిన వారిని శిక్షించాలని చేస్తున్న పోరాటానికి కుటుంబసభ్యుల్లో వైఎస్ షర్మిల మాత్రమే మద్దతు తెలిపారని సునీత అన్నారు. మొదటినుండి షర్మిల తనకు అండగా నిలిచారన్నారు. అలాగే ఎందరో పోలీసులు, న్యాయవాదులు, మీడియా వాళ్లు తనకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఇక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, మహాసేన రాజేష్, సిపిఐ నేత నారాయణ, సిపిఎం నేత గఫూర్ తదితరులు తనకు సహకరించారని తెలిపారు. ఇలా తన పోరాటానికి సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సునీత పేర్కొన్నారు.
తండ్రి తండ్రిని హత్యలో కీలక పాత్ర వైఎస్ అవినాష్ రెడ్డిదే... అతడిని శిక్షించే వరకు తన పోరాటం ఆగదని వైఎస్ సునీత స్పష్టం చేసారు. కాస్త ఆలస్యం కావచ్చు... కానీ తప్పు చేసినవారు తప్పించుకోలేరని అన్నారు. తప్పుచేసిన అవినాష్ కు వైసిపి ప్రభుత్వం అండగా నిలిచింది... అందువల్లే న్యాయపోరాటం చేస్తున్న తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
జగనన్న ఎప్పుడూ విలువలు, విశ్వసనీయత, మాట తప్పను, మడమ తిప్పను అంటుంటారు... మరి సొంత బాబాయ్ హత్యకేసులో ఇలాంటి ఏమయ్యాయి? అని సునీత ప్రశ్నించారు. వివేకాను చంపినవారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుందన్నారు. మంచి, చెడుకు యుద్ధమంటున్నారే... మరి మీరెందుకు చెడ్డవారి పక్షాన నిలబడ్డారని అడిగారు. పేదలు, పెత్తందార్లకు మధ్య యుద్ధమంటున్నారుగా... మరి ఐదేళ్ళుగా న్యాయపోరాటం చేస్తున్న చెల్లిని ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. కేవలం తమ అనుకునే వాళ్లకే జగనన్న న్యాయం చేస్తారని అర్థమయ్యిందని వైఎస్ సునీత రెడ్డి పేర్కొన్నారు.