Asianet News TeluguAsianet News Telugu

ముహూర్తం ఫిక్స్.. షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా 21న, ఇడుపుల పాయనుంచి బాధ్యతల స్వీకరణ..

వైయస్ షర్మిల ఇడుపులపాయను సెంటిమెంట్ గా భావిస్తున్నారు ఏ పని మొదలుపెట్టిన ఇడుపులపాయ నుంచే మొదలు పెడుతున్నారు. కొడుకు రాజారెడ్డి పెళ్లి పత్రికను కూడా ముందు తండ్రి సమాధి దగ్గర ఉంచిన తర్వాతే తాడేపల్లిలోని వైయస్ జగన్ ను కలిసి ఆహ్వానించారు. ఇప్పుడు పార్టీ పగ్గాలకు కూడా ఇడుపులపాయలోనే వేదిక చేసుకుంటుండడం గమనార్హం

YS Sharmila will take charge  APCC president on january 21st - bsb
Author
First Published Jan 18, 2024, 8:36 AM IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజురోజుకో కొత్త మార్పు చోటు చేసుకుంటోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ మార్పులు, చేర్పులు.. పార్టీ జంప్ లతో పాటు కొత్త పార్టీలు పుట్టుకురావడం.. పాత పార్టీలు మళ్లీ ఊపిరి పోసుకోవడంతో హాట్ హాట్ గా మారిపోతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల అధ్యక్షురాలిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షర్మిల పార్టీ పగ్గాలను జనవరి 21, ఆదివారం చేపట్టనున్నట్టు సమాచారం. 

ఇడుపులపాయలో తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గరే ఆమె పిసిసి పగ్గాలు చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ప్రత్యేక అతిధిగా రానున్నారు. ఏపీసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకారానికి వైఎస్ఆర్ అనుచరులు, అభిమానులు పెద్దఎత్తున హాజరుకాన్నారు. తమ మద్దతును షర్మిలకు తెలపనున్నారు. ఈ కార్యక్రమానికి వీరితోపాటు కేంద్ర మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు,  వర్కింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ నేతలు కూడా హాజరుకానున్నారు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు అయినా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తన వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక వైయస్ షర్మిల ఇడుపులపాయను సెంటిమెంట్ గా భావిస్తున్నారు ఏ పని మొదలుపెట్టిన ఇడుపులపాయ నుంచే మొదలు పెడుతున్నారు. కొడుకు రాజారెడ్డి పెళ్లి పత్రికను కూడా ముందు తండ్రి సమాధి దగ్గర ఉంచిన తర్వాతే తాడేపల్లిలోని వైయస్ జగన్ ను కలిసి ఆహ్వానించారు. ఇప్పుడు పార్టీ పగ్గాలకు కూడా ఇడుపులపాయలోనే వేదిక చేసుకుంటుండడం గమనార్హం.. మరోవైపు వైయస్ షర్మిల కుమారుడు వైయస్ రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న జరగనుంది. నిశ్చితార్థ వేడుక జనవరి 18, గురువారం అంటే నేడు హైదరాబాదులో జరగనుంది.

వై.ఎస్. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు: సవాళ్లు ఇవీ

ఆ తర్వాత శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వైయస్ రాజశేఖర్ రెడ్డి అనుచరులతో వైఎస్ షర్మిల సమావేశం అవుతారు. ఆ తర్వాత ఏపీసీసీ అధ్యక్ష్య బాధ్యతలు చేపట్టి.. అనంతరం తన కార్యాచరణను ప్రకటిస్తారు. నేరుగా ప్రజల్లోకి వెళతారని సమాచారం. రాష్ట్రవ్యాప్త పర్యటనల్లో భాగంగా ఆమె రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణం సహా అన్ని విభజన హామీల అమలు కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రచారం చేయనున్నారు.

అధికార పార్టీ అధినేత అయిన అన్న జగన్ మీదే ప్రచారం చేయనున్నారు. బడుగు, బలహీన, మైనారిటీలకు కాంగ్రెస్ తోనే న్యాయం జరుగుతుందని, ఆ వర్గాలకు జగన్ చేసిందేమీ లేదని.. కేవలం వారిని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని ప్రచారం చేయనున్నట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios