Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుపై ధ్వజమెత్తిన షర్మిల

వచ్చే ఎన్నికల్లో రాబోయేది రాజన్న రాజ్యమేనంటూ ఘంటాపధంగా చెప్పారు. నమ్మకానికి, విశ్వాసానికి, అభిమానానికి తాము మారుపేరుగా చెప్పుకున్నారు షర్మిల. తమకు ప్రజల అండ, అభిమానం చాలన్నారు. తమను రైతుల, దళిత, గిరిజన, మైనారిటీ, పేదల పక్షపాతిగా షర్మిల అభివర్ణించుకున్నారు.

Ys sharmila came down heavily on naidu govt

‘అబద్దాలతో ఒకసారే జనాలను మోసం చేయగలరు, అది 2014లో అయిపోయింది’..ఇది వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు. ప్లీనరీ రెండో రోజు వైఎస్ షర్మిల చంద్రబాబునాయుడు గురించి, పాలన గురించి క్లుప్తంగా, సూటిగా కొన్ని వ్యాఖలు చేసారు. 15 నిముషాల మత్రమే మాట్లాడిన షర్మిల నేతలను, శ్రేణులను బాగా ఆకట్టుకున్నారు. పోయిన ఎన్నికల్లో టిడిపి కూటమికి, వైసీపీకి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం కేవలం 5 లక్షలు మాత్రమే అన్నారు. 5 లక్షల మెజారిటీ కడప పార్లమెంట్ స్ధానంలో సోదరుడు జగన్, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎప్పుడో వచ్చేసిన విషయాన్ని గుర్తు చేసారు.

ఓ ఎంపికి 5 లక్షల ఓట్ల మెజారిటీ ఎక్కువ అవ్వచ్చేమో గానీ రాష్ట్రవ్యాప్తంగా టిడిపి కూటమికి వచ్చిన మొత్తం 5 లక్షల ఓట్ల ఆధిక్యత చాలా చాలా తక్కువన్నారు. అదికూడా చంద్రబాబు మొహం చూసి రాలేదని, మోడి వల్ల, రుణమాఫీ లాంటి మోసపూరిత వాగ్దానాల వల్లే వచ్చాయన్నారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను అన్నిసార్లు చంద్రబాబు మోసం చేయలేరన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.

చంద్రబాబు లాగ తప్పుడు వాగ్దానాలను జగన్ కూడా ఇచ్చి వుంటే 2014లోనే వైసీసీ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. కానీ ప్రజలను తప్పుడు వాగ్దానాలతో మోసం చేయటం ఇష్టంలేకే జగన్ ప్రతిపక్షంలో కూర్చోవటానికి కూడా సిద్ధపడ్డారని తెలిపారు. తమకు ఓట్లేసిన ఓటర్లేనే కాకుండా రాష్ట్ర ప్రజలను మొత్తం మోసి చేసిన నీచపు రాజకీయ చరిత్ర చంద్రబాబుది అని ధ్వజమెత్తారు. ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు ఎద్దేవా చేసారు.

చంద్రబాబు మోసం దేశమంతా తెలిసిపోయిందని, చివరకు మోడికి కూడా అర్ధమైపోయిందన్నారు. ఇక చంద్రబాబు పప్పులుడకవని, ఇంట్లో ఉన్న పప్పు తప్ప అని ఎద్దేవా చేసారు. ఎదురుగా వచ్చి పోరాడాలంటే ధైర్యం కావాలని, చంద్రబాబు చరిత్ర మొత్తం వెన్నుపోటేనని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాబోయేది రాజన్న రాజ్యమేనంటూ ఘంటాపధంగా చెప్పారు. నమ్మకానికి, విశ్వాసానికి, అభిమానానికి తాము మారుపేరుగా చెప్పుకున్నారు షర్మిల. తమకు ప్రజల అండ, అభిమానం చాలన్నారు. తమను రైతుల, దళిత, గిరిజన, మైనారిటీ, పేదల పక్షపాతిగా షర్మిల అభివర్ణించుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios