వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడికి క్షమాభిక్ష

Ys raja reddy murder case: Sudhakar reddy arrest in nellore
Highlights

వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడికి క్షమాభిక్ష

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకర్ రెడ్డికి ఆంధ్రప్రదశ్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. కడప జిల్లా వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డిని రాజారెడ్డి హత్య కేసులో 13వ నిందితుడిగా చేర్చారు పోలీసుులు.. తీర్పు సందర్భంగా 2006లో న్యాయస్థానం అతనికి జీవితఖైదు విధించింది. అప్పటి నుంచి ఆయన నెల్లూరు జిల్లా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు.   మొత్తం 11 సంవత్సరాల 10 నెలల పాటు మధుసూదన్ రెడ్డి జైలు శిక్షను అనుభవించారు.. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మొత్తం 47 మందిని ఇవాళ ప్రభుత్వం విడుదల చేసింది. వారిలో సుధాకర్ రెడ్డి ఒకరు.  

loader